ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి సినిమాలంటే చాలు ప్రేక్ష‌కుల‌కి ఎంత క్రేజ్ అంటే అంతా ఇంతా కాదు. అయితే ప్ర‌స్తుతం రాజ‌మౌళి మ‌ళ్ళీ దొరికిపోయాడ‌నే చెప్పాలి. అంటే ఏ విష‌యంలో ఏంటా త‌ప్పు రాజ‌మౌళి కూడా త‌ప్పులు చేస్తాడా అన్న అనుమానాలు వ‌స్తున్నాయా...అంటే అవున‌నే అంటున్నాయి టాలీవుడ్ వ‌ర్గాలు. జ‌క్క‌న్న తీస్తున్న `ఆర్ ఆర్ ఆర్‌` ఓ హాలీవుడ్ చిత్రానికి కాపీ అని తెలిసింది. `స్టూడెంట్ నెం.1` సినిమా నుంచి రాజ‌మౌళి వరుస విజ‌యాల‌తో అప‌జ‌య‌మెరుగ‌ని ద‌ర్శ‌కుడిగా పేరు తెచ్చుకున్నాడు. అయితే అత‌ని కెరీర్‌లో చేసిన అత్య‌ధిక చిత్రాల‌న్నీ కాపీ సినిమాలే.

 

హాలీవుడ్ చిత్రాల్ని తెలివిగా కాపీ చేయ‌డంలో ఆయ‌న‌ను మించిన వారు ఎవ్వ‌రూ లేరు అంటారు చాలా మంది. ఈ విద్య‌ని గురువు రాఘ‌వేంద్ర‌రావు నుంచే జ‌క్కన్న నేర్చుకున్నాడు. బాలీవుడ్ హిట్ చిత్రం `సాజ‌న్‌`ని పాత్ర‌ల్ని తెలివిగా మార్చి కె. రాఘ‌వేంద్ర‌రావు `అల్ల‌రి ప్రియుడు` చిత్రాన్ని తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఆ చిత్రం సూప‌ర్‌హిట్‌ని సొంతం చేసుకుంది. అదే ఫార్ములాని ఉప‌యోగిస్తూ ఎవ‌రికీ చిక్క‌కుండా కాపీ క‌థ‌ల‌తో వ‌రుస హిట్‌ల‌ని బ్లాక్ బ‌స్ట‌ర్‌ల‌ని రాజ‌మౌళి త‌న సొంతం చేసుకుంటున్నాడు.

 

`ర‌గ్బీ డ్యాన్స్‌` నుంచి `సై`ని తెలివిగా కాపీ చేసిన రాజ‌మౌళి విక్ర‌మార్కుడు చిత్రాన్ని విజ‌య‌శాంతి చేసిన `పోలీస్ లాక‌ప్‌` నుంచి లేపేశాడు అంటారు. అలాగే ఇక ఇండ‌స్ట్రీ హిట్‌గా నిలిచిన `మ‌గ‌ధీర‌` చిత్రాన్ని హాలీవుడ్ చిత్రం క్ల‌స్ట‌ర్స్ ఆఫ్ ఆరోస్‌, చండేరీ న‌వ‌ల, `ట్రాయ్‌` ఆధారంగా కాపీ చేసిన రాజ‌మౌళి అప్ప‌ట్లో చండేరీ న‌వ‌లా ర‌చియిత కార‌ణంగా వివాదాన్ని కూడా ఎదుర్కోవ‌ల‌సి వ‌చ్చింది.

 

ఇక `మ‌ర్యాద రామ‌న్న‌` చిత్రాన్ని `అవ‌ర్ హాస్పిటాలిటీ` అనే చిత్రం నుంచి కాపీ చేసి విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నారు కూడా. ఇక తాజాగా అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్న‌ `ఆర్ ఆర్ ఆర్‌` చిత్రాన్ని కూడా హాలీవుడ్ చిత్రం `ఫైర్ అండ్ వాట‌ర్‌` నుంచి కాపీ చేశార‌ని తాజాగా విమర్శ‌లు మొద‌ల‌య్యాయి. ఈ చిత్రం 1983లో విడుద‌లైంది. పాత సినిమా కాబ‌ట్టి దీన్ని ఎవ‌రూ గుర్తుంచుకునే అవ‌కాశం లేద‌ని, ఆ ధైర్యంతోనే రాజ‌మౌళి కాపీ చేశాడ‌ని అప్పుడే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. మ‌రి ఈ విమ‌ర్శ‌ల్ని రాజ‌మౌళి ఎప్ప‌టిలాగే లైట్ తీసుకుంటాడో లేక కాపీ కాద‌ని వివ‌ర‌ణ ఇస్తారో చూడాలి. మ‌రి ప్ర‌తిసారి ఇలాంటి విమ‌ర్శ‌లు ఎందుకు వ‌స్తున్నాయి. ఓసారి ఆయ‌నే చూసుకోవాలి. అంద‌రూ ఎంతో మేధావి అని భావించే రాజ‌మౌళికి క‌థ‌ని క్రియేట్ చేసేంత లేదాఅని కొన్ని విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: