ఇండస్ట్రీలో కొంత మంది హీరోలు ఇమేజ్ కోసం సినిమాలు చేస్తారు. కొంతమంది ఫ్యాషన్ కోసం సినిమాలు చేస్తారు. అడవి శేష్ ఇందులో రెండవ రకం. చిత్ర పరిశ్రమకి వచ్చి చాలా కాలమైనప్పటికి ఈ మధ్య కాలం లోనే హీరోగా ఎదుగుతున్నాడు. స్టార్ హీరో అన్న ఇమేజ్ అయితే రాలేదు గాని ఆయన సినిమాలకి మంచి బిజినెస్ మాత్రం అవుతోంది. అంతేకాదు మార్కెట్ కూడా బాగా సంపాదించుకున్నాడు. ఒక రకంగా చూస్తే ఇప్పుడున్న కొందరు యంగ్ హీరోలతో పొల్చుకుంటే అడవి శేష్ చాలా బెటరని చెప్పాలి. మాస్ ఇమేజ్ అంటూ పిచ్చి సినిమాలు తీయకుండా తనకంటూ ఒక సపరేట్ పంథాలో వెళుతూ సక్సస్ లు అందుకుంటున్నాడు. 

 

క్షణం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అడవి శేష్. ఈ సినిమా కమర్షియల్ గాను బాగా వర్కౌట్ అయింది. ఆ తర్వాత గూఢా చారి, ఎవరు చిత్రాలని చేసి మంచి పేరు సంపాదించుకున్నాడు. అంతేకాదు పి.వి.పి లాంటి పెద్ద నిర్మాణ సంస్థల తో మంచి రిలేషన్ ని మేయిన్‌టైన్ చేస్తున్నాడు. ఇక అడవి శేష్ ఇలా సక్సస్ లు అందుకోవడానికి కారణం అతని క్రియోటివ్ బ్రేయిన్ అని చెప్పాలి. మల్టీ టాలెంటెడ్ అయిన అడవి శేష్ కి కథ, స్క్రీన్ ప్లే మీద మంచి గ్రిప్ ఉంది. క్రియోటివ్ థాట్స్ తో మంచి స్క్రిప్ట్స్ ని రెడీ చేసుకోవడం లో అడవి శేష్ స్టైల్ చాలా విభిన్నంగా ఉంటుంది. ఇక ప్రయోగాలు చేయడం కూడా అడవి శేష్ కి బాగా కలిసి వస్తుంది. 

 

ఇక ప్రస్తుతం అడవి శేష్ 2008 ముంబై దాడుల్లో అమరుడైన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ బయోపిక్ లో శేష్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని తెలుగు.. హిందీ భాషల్లో సూపర్ స్టార్ మహేష్ నిర్మిస్తున్నారు. ఎంబీ బ్యానర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా తో శేషు తన ఇమేజ్ ని పాన్ ఇండియా స్థాయికి చేర్చాలనే తాపత్రయం తో ఉన్నాడు. ప్రస్తుత లాక్ డౌన్ నేపథ్యంలో సెలబ్రిటీలంతా ఇళ్లలోనే కాలక్షేపం చేస్తున్నారు. ఫ్యామిలీ తో ఎక్కువ సమాయాన్ని గుడపుతున్నారు. కాని శేషు మాత్రం ఇప్పుడు దొరికిన ఖాళీ సమయాన్ని కూడా సినిమాలకే కేటాయించాడు. రకరకాల స్క్రిప్టులపై వర్క్ చేస్తూ..క్లాసిక్ చిత్రాలను స్టడీ చేస్తున్నాడట. ఇక ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీలో చాలామంది అడవి శేష్ లాంటి మల్టీ టాలెంటెడ్ చాలా అవసరమని కితాబిస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: