కోలీవుడ్ యంగ్ హీరో శివ కార్తికేయన్, అభిమన్యుడు ఫేమ్  పీఎస్ మిత్రన్  కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం హీరో. గత ఏడాది డిసెంబర్ లో విడుదలైన ఈ చిత్రం  పాజిటివ్ రివ్యూస్ ను రాబట్టుకుంది కానీ అనుకున్న రేంజ్ లో మాత్రం కలెక్షన్స్ ను రాబట్టలేకపోయింది. సూపర్ హీరో బ్యాక్ డ్రాప్ లో ఎడ్యుకేషనల్ సిస్టం ను  బేస్  చేసుకొని తెరకెక్కిన ఈ చిత్రాన్ని కేజేఆర్ స్టూడియోస్ పతాకం పై కొట్టిపాడి జె రాజేష్ నిర్మించగా హలో ఫేమ్ కల్యాణిని ప్రియదర్శన్ హీరోయిన్ గా నటించింది. కళ్యాణి కి కోలీవుడ్ లో ఇదే మొదటి సినిమా.  కాగా బాలీవుడ్ నటుడు అభయ్ డియోల్ విలన్ పాత్రలోనటించగా యాక్షన్ కింగ్ అర్జున్  ఓ కీలక పాత్రలో నటించాడు. 
 
ఇక ఇంతకుముందు శివకార్తికేయన్ నటించిన రెమో తెలుగులో కూడా విడుదలకావడంతో హీరో ను శక్తిగా తెలుగులోకి డబ్ చేశారు. మార్చి చివర్లో ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలనుకున్నారు  కానీ  కరోనా వల్ల లాక్ డౌన్ అమల్లోకి రావడం తో థియేటర్లను మూసి వేశారు. ఏకంగా 21 రోజులు లాక్ డౌన్ కొనసాగడం ఆతరువాత  థియేటర్లు తెరిచినా స్ట్రెయిట్ తెలుగు సినిమాలు క్యూ కట్టనుండడంతో డైరెక్ట్ గా ఈ చిత్రాన్ని డిజిటల్ లో రిలీజ్ చేశారు.
 
శక్తి డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది దాంతో ఈ చిత్రం ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. అలా కరోనా దెబ్బకు థియేటర్లలో విడుదలకావల్సిన సినిమాను డైరెక్ట్ గా డిజిటల్ లోకి తీసుకొచ్చారు. ఇప్పట్లో థియేటర్లు రీ ఓపెన్ అయ్యే అవకాశాలు లేకపోవడంతో మరి కొన్నిచిన్న సినిమాలను డైరెక్ట్ గా డిజిటల్ లోకి విడుదలచేసేందుకు నిర్మాతలు రెడీ అవుతున్నారని సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: