న్యూ జనరేషన్ హీరో ఎంట్రీ కోసం టాలీవుడ్ మొత్తం ఎదురుచూస్తోంది ఎవరని అడిగితే ఠక్కున వచ్చే పేరు నందమూరి మోక్షజ్ఞ. నందమూని నట సింహం బాలకృష్ణ ముద్దుల తనయుడైన ఈ యంగ్ స్టర్ గురించి బాలయ్య అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. బాలయ్యపై కూడా మోక్షజ్ఞ ఎంట్రీ గురించి ప్రెషర్ ఉంది. ఆమధ్య నిర్మాత సాయి కొర్రపాటి కూడా ‘రానే వచ్చాడు రామయ్య’ అనే టైటిల్ మోక్షజ్ఞ కోసం రిజిస్టర్ చేయించాడని వార్తలు వచ్చాయి. మోక్షజ్ఞని ఇంట్రడ్యూస్ చేసే డైరక్టర్ లిస్టు కూడా పెరిగిపోతోంది.

 

 

రీసెంట్ గా ఫిలింనగర్లో మోక్షజ్ఞ పై ఓ వార్త రౌండ్ అవుతోంది. ఈ న్యూస్ ప్రకారం మోక్షజ్ఞ ఎంట్రీ బాధ్యతను బాలయ్య దర్శకుడు క్రిష్ చేతుల్లో పెట్టాడని అంటున్నారు. గతంలోనే దీనిపై వార్తలు వచ్చాయి. ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు సినిమాల్లోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని వార్తలు వచ్చాయి. కానీ అవేమీ కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు మళ్లీ మోక్షజ్ఞ ఎంట్రీపై వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్ సిరీస్ సినిమాలు ఫెయిలయినా క్రిష్ పనితీరుపై బాలయ్య చాలా నమ్మకంగా ఉన్నాడట. క్రిష్ కూడా మోక్షజ్ఞ ఎంట్రీ బాధ్యతను తీసుకోవడానికి గతంలోనే ఓకే చెప్పాడని టాక్. ప్రస్తుతం క్రిష్ పూర్తిగా పవన్ కల్యాణ్ సినిమాతో బిజీగా ఉన్నాడు.

 

 

సినిమా తర్వాతే మోక్షజ్ఞ తొలి సినిమాపై పని చేస్తాడని అంటున్నారు. నిజానికి మోక్షజ్ఞను లాంచ్ చేయాలని దర్శకుడు అనిల్ రావిపూడి ఇంట్రెస్ట్ గా ఉన్నాడని కూడా వార్తలు వస్తున్నాయి. ఇందుకు సంబంధించిన సబ్జెక్టును బాలయ్యకు వినిపించబోతున్నాడని కూడా వార్తలు వచ్చాయి. ఈ వార్తలన్నింటిపై అఫిషియల్ న్యూస్ రావాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే. యాక్టింగ్ లో ట్రైనింగ్ కోసం మోక్షజ్ఞ యూఎస్ వెళ్లాడని కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. మరి.. మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడో బాలకృష్ణ చెప్పాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: