మెగాస్టార్ చిరంజీవి అంటే క్రేజ్ ఏస్థాయిలో ఉంటుందో తెలిసిన విషయమే. ప్రేక్షకుల్లోగానీ ఇండస్ట్రీలో గానీ ఆయన సినిమాలపై ఉండే బజ్ అంతా ఇంతా కాదు. అలాంటి చిరంజీవి ఫ్యాన్స్ తో రెగ్యులర్ ఇంటరాక్ట్ అయితే ఇక అభిమానుల ఆనందానికి హద్దేముంటుంది. మొన్న ఉగాదికి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ లో ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ ఆ రెండు విభాగాల్లోనూ రఫ్పాడేస్తున్నారు. తన ఇన్ స్టా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

 

 

కరోనా ప్రభావంతో ప్రస్తుతం షూటింగ్స్ లేకపోవడంతో అందరిలానే ఇంటిపట్టునే ఉంటున్న మెగాస్టార్ తన ఇంటి పరిసరాలను తన కెమెరాలో బంధించాడు. ప్రకృతి గురించి తన మెసేజ్ చేప్తూ.. భూమిని నాశనం చేసుకోవడం మనం చేస్తున్న పనే అని చెప్పుకొచ్చాడు. ప్రకృతిని ప్రేమించండి. స్టే హోమ్.. స్టే సేఫ్ అంటూ ఈ వీడియో సాగింది. ఈ వీడియో చిత్రీకరణలో మెగాస్టార్ తన ఇంటి పరిసరాలను చూపించాడు. అందమైన పెద్ద స్విమ్మింగ్ పూల్, భారీ బిల్డింగ్, అందమైన లాన్, లాన్ నుంచి హైదరాబాద్ సిటీ వ్యూ.. ఎంతో ఆకర్షణీయంగా ఉంది. చూస్తుంటేనే ఎంత ఖరీదైన టైల్స్, ఇంటీరియర్ వాడారో అర్ధమవుతోంది.

 

 

రాజసం ఉట్టిపడుతున్న రియల్ మాహిష్మతి భవంతిలా ఉంది చిరంజీవి ఇల్లు. చిరంజీవి ఇంటికి అభిమానులతో పాటు ఎవరు వెళ్లినా పోర్టికో వరకో, గెస్ట్ రూమ్ వరకో వెళ్లగలరు. అంతకుమించి వీక్షించే అవకాశం లేదు. కానీ.. చిరంజీవి ఈ వీడియోలో తన ఇంటి పరిసరాలను చూపించడంతో ఆయన నివాసం ఎంత లావిష్ గా ఉంటుందో అర్ధమవుతోంది. ఈ వీడియోకు మెగా అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. చిరంజీవి ఇంటిని ప్రత్యక్షంగా చూసినట్టే ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. మెగాస్టార్ ఇల్లా మజాకా!

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Happy Sri Rama Navami to All! #StayHomeStaySafe

A post shared by chiranjeevi Konidela (@chiranjeevikonidela) on

 

మరింత సమాచారం తెలుసుకోండి: