సౌత్ క్రేజీ హీరోయిన్ నయనతార తన లవ్ స్టోరీస్ తో అందరికి షాక్ ఇచ్చింది. శింబుతో పీకల్లోతు ప్రేమలో పడి బయటకు వచ్చిన అమ్మడు ఆ తర్వాత ప్రభుదేవాతో లవ్ ఎఫైర్ సాగించింది. ప్రభుదేవాతో పెళ్లికి కూడా సిద్ధమైన నయనతార అతనికి హ్యాండ్ ఇచ్చింది. ఇక ఫైనల్ గా కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ తో నయనతార లవ్ స్టోరీ ఒక రేంజ్ లో నడుస్తుంది. నా రౌడీ ధాన్ సినిమా డైరెక్ట్ చేసిన విఘ్నేష్ ఆ సినిమాలో నయనతారని హీరోయిన్ గా తీసుకోగా అప్పటినుండి వీరి లవ్ స్టోరీ మొదలైంది. అయితే ఏళ్లకేళ్లు ప్రేమించుకుంటున్న ఈ జంట పెళ్ళెప్పుడు అంటే మాత్రం సైలెంట్ గా ఉంటారు. 

 

కొన్నాళ్ళు వీరిద్దరూ కలిసి సహజీవనం చేసినట్టుగా కూడా వార్తలు వచ్చాయి. నయన్ తో పెళ్లి కోసం విఘ్నేష్ కూడా ఎదురుచూస్తున్నాడు. తెలుస్తున్న సమాచారం ప్రకారం విఘ్నేష్ నయనతారలు ఈ ఇయర్ ఎండింగ్ కల్లా పెళ్లి చేసుకంటారట. ఎంగేజ్మెంట్ ఈ సమ్మర్ లో ఉంటుందని కోలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఈ ఇయర్ ఎండింగ్ లో ఎట్టిపరిస్థితుల్లో విఘ్నేష్ శివన్, నయనతారల పెళ్లి జరుగుతుందని అంటున్నారు. 

 

కోలీవుడ్ లో స్టార్ హీరోలకు ఈక్వల్ ఇమేజ్ సాధించిన నయనతార ఒక పక్క కమర్షియల్ సినిమాలు చేస్తూనే ఫీమేల్ లీడ్ మూవీస్ చేస్తూ సత్తా చాటుతుంది. నయన్ సినిమా అంటే పక్కా హిట్ అనేలా టాక్ వచ్చింది. అయితే ఈమధ్య అమ్మడు చేసిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాలు ఇవ్వలేదు. అందుకే ఇక పెళ్లి వైపు గాలి మళ్లింది. విఘ్నేష్ కూడా నయన్ తో పెళ్లి గురించి కొన్నాళ్లుగా వెయిట్ చేస్తున్నారు. ఈ ప్రేమ పక్షులు పెళ్లితో తన ప్రేమని ప్రమోట్ చేసుకునే రోజు దగ్గరలోనే ఉందని తెలుస్తుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: