పవన్ కళ్యాణ్ కు లక్షల స్థాయిలో వీరాభిమానులు ఉన్నారు. పవన్ కు వారంతా అభిమానులు అనడంకంటే భక్తులు అని అనడం సముచితం. అయితే ఇంతమంది వీరాభిమానులు ఉన్నా పవన్ గత ఎన్నికలలో రెండు చోట్ల పోటీ చేసినా కనీసం ఎమ్ ఎల్ ఎ గా కూడ నేగ్గలేకపోయాడు. అయితే ఈ పరాభవాన్ని పరిగణలోకి తీసుకోకుండా పవన్ రెట్టించిన ఉత్సాహంతో తిరిగి సినిమాల వైపు యూటర్న్ తీసుకోవడమే కాకుండా తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో ఒక కీలక శక్తిగా ఎదగడానికి ఇప్పటికీ చాల గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు. 

 

ఇలాంటి పరిస్థితులలో పవన్ కు నేడు ఒక పరీక్ష ఎదురు కాబోతోంది. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావంతో దేశం అంతా లాక్ డౌన్ ఉన్న పరిస్థితులలో అనేకమంది సినిమా సెలెబ్రెటీలు వర్తక వ్యాపార ప్రముఖులు పారిశ్రామిక వేత్తలు ప్రధానమంత్రి సహాయ నిధికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి భారీ విరాళాలను అందచేస్తున్నారు.  


ఇలాంటి పరిస్థితులలో పవన్ ‘నేను సైతం’ అంటూ తన అభిమానులకు ఒక పిలుపు ఇచ్చాడు. కరోనా పై పోరులో భాగంగా నేడు ఏప్రిల్‌ ౩న ప్రతి ఒక్క భారతీయుడు దేశం కోసం రూ.100 ఆ పైన.. ఎవరి శక్తి కొద్ది వారు.. ‘PM CARES’ కు విరాళం ఇచ్చి ప్రధాని మంత్రి మోదీకి నైతిక మద్దతు తెలుపమని కోరుతూ పవన్ నిన్న ఒక ప్రకటన ఇచ్చాడు. దీనితో పవన్ ప్రకటనకు ఎలాంటి స్పందన నేడు వస్తుంది అన్న విషయమై అన్ని వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. 


గతంలో కమలహాసన్ రాజకీయాలలోకి వచ్చి ‘మక్కల్ నీధి మయం’ పార్టీని స్థాపించి ఆ పార్టీకి విరాళాలు కావాలి అంటూ కమల్ సోషల్ మీడియా ద్వారా అభ్యర్ధించిన వెంటనే కమలహాసన్ అభిమానులు కోట్లల్లో విరాళాలు ఇచ్చారు. పవన్ ‘జనసేన’ పార్టీ పెట్టిన తరువాత కాని గత సంవత్సరం జరిగిన ఎన్నికల సమయంలో కాని పవన్ విరాళాలు ఇమ్మని ఏనాడు తన అభిమానులను అడగలేదు. అయితే ఇప్పుడు కరోనా జాతీయ విపత్తుగా మారడంతో పవన్ తన అభిమానులను విరాళాలు ఇమ్మని అడుగుతున్నాడు. పవన్ కనిపిస్తే చాలు ‘సి ఎమ్’ పవన్ అంటూ రెచ్చిపోయే అభిమానులు పవన్ పిలిపుకు ఏ మేరకు స్పందిస్తారో అన్నది ఈరోజు తేలిపోతుంది..

 

మరింత సమాచారం తెలుసుకోండి: