బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ బేబో కరీనా కపూర్‌ ఈ నెల వోగ్ మ్యాగజైన్ కవర్ పేజ్ మీద మెరిసింది. ప్రస్తుతం లాక్‌ డౌన్‌ కారణంగా ప్రజలంతా ఇళ్లకే పరిమితం కాటంతో కరీనా కూడా ఇంటి నుంచి వోగ్ కు ఇంటర్య్వూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూ గురువారం పబ్లిష్‌ అయ్యింది. అయితే దేశంలో పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్న సమయంలో ఓ మ్యాగజైన్‌ను ప్రమోషన్‌ ఇంటర్వ్యూ ఇవ్వటం హాట్ ఫోటో షూట్ చేయటంపై కరీనా పై నెటిజెన్లు మండిపడుతున్నారు.

 

అయితే నిజానికి కరీనా ఆ ఫోటో షూట్ నెల క్రితమే చేసింది. దేశంలో కరోనా లాక్‌ డౌన్‌ ప్రకటించకముందే ఫోటో షూట్‌ లో పాల్గొంది కరోనా. ఆ ఫోటోలతోనే ఏప్రిల్ ఎడిషన్‌ ను రిలీజ్ చేశారు. అంతేకాదు కరినా ఫోటో షూట్‌కు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. దీంతో ఈ పరిస్థితుల్లో హాట్ ఫోటో షూట్ ఏంటి అని ప్రశిస్తున్నారు.

 

ఇంటర్వ్యూలో భాగంగా వాట్‌ ఇఫ్‌ గేమ్ ఆడింది కరీనా. ఈ సందర్భంగా ఆమెను ఒక వేళ కాలంలో వెనక్కు ప్రయాణించే అవకాశం వస్తే ఏం మారుస్తారు అంటూ ప్రశ్నించగా, ఆమె స్పందిస్తూ కరోనా వైరస్‌ పై మొదట్లో స్పందించిన తీరు మారుస్తా. మొదటి నుంచే ఈ వైరస్‌ గురించి సీరియస్‌గా ఆలోచించేలా చేస్తా` అంటూ సమాధానమిచ్చింది. అయితే ఈ కష్ట కాలంలో దేశం కోసం రూపాయి కూడా ఇవ్వకుండా ఇలా నీతులు చెప్పటంపై నెటిజెన్లు ఫైర్‌ అవుతున్నారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

If I could turn back time, I’d... “do nothing that I haven’t done.” After 20 years in films, here’s how @KareenaKapoorKhan re-imagines life, work and the world through 20 questions in our april issue. Photographed by: tarun Vishwa. Styled by: @Anaitashroffadajania. Words by: @ritusom. Hair: @yiannitsapatori. Makeup: @makeupbypompy. Production: @prachitiparakh, Bindiya Chhabria. Set design and props: @Bindiya01. Location: @Snowball.Studios

A post shared by VOGUE India (@vogueindia) on

మరింత సమాచారం తెలుసుకోండి: