కరోనా కారణంగా దేశమంతా లాక్ డౌన్ లో ఉండడంతో జనాలు ఇళ్ళకే పరిమితమయ్యారు. పనులేమీ లేకపోవడంతో ఆన్ లైన్ లో సినిమాలకి గిరాకీ బాగా పెరిగింది. అమెజాన్ లో వచ్చిన ప్రతీ సినిమానీ చూసేస్తున్నారు. సాధారణంగా చిన్న సినిమాలని డిజిటల్ లో చూడడానికి కూడా ఆసక్తి చూపించని వారు కూడా పనేమీ లేకపోవడంతో చిన్న సినిమాలను కూడా చూసేస్తున్నారు. మొన్నటికి మొన్న నాని నిర్మించిన హిట్ సినిమా అమెజాన్ లోకి వచ్చింది.

 


థియేటర్లు మూసివేయడంతో కరువు కాలంలో ఉన్న ప్రేక్షకులు హిట్ సినిమా రాగానే దాని మీద పడిపోయారు. విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఈ సినిమాకి ప్రైమ్ లో వ్యూస్ బాగా వస్తున్నాయట. అదే కాదు లాక్ డౌన్ అయ్యాక అమెజాన్ లో విడుదల అయిన ఓ పిట్ట కథ, రాజావారు రాణిగారు వంటి సినిమాలకి కూడా గిరాకీ బాగా పెరిగింది. ఈ చిత్రాలు థియేటర్లలో అంతగా ఆకట్టుకోకపోయినా డిజిటల్ లో లాక్ డౌన్ పుణ్యమా అని బాగా వ్యూస్ వస్తున్నాయి.

 

అయితే దీన్ని అదునుగా తీసుకుని కొందరు నిర్మాతలు తమ సినిమాలని డైరెక్టుగా డిజిటల్ లో విడుదల చేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారట. ప్రజలంతా ఇళ్లలోనే ఉండిపోవడంతో వ్యూస్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నందున ఈ విధంగా చేస్తే లాభపడే అవకాశం ఉందని భావిస్తున్నారట. లాక్ డౌన్ ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుందన్న దానిపై అనేక పుకార్లు వినిపిస్తున్న నేపథ్యంలో తమ చిత్రాల్ని డిజిటల్ లో రిలీజ్ చేయడానికి సిద్ధం అవుతున్నారట.

 


చిన్న బడ్జెట్ సినిమాలని ఈ విధంగా రిలీజ్ చేసి డబ్బులు సంపాదించుకుందామనే ఆలోచనలో ఉన్నారట. లాక్ డౌన్ ఎత్తివేసినా తర్వాత చిన్న సినిమాలు చాలా చిత్రాలతో పోటీ పడాల్సి వస్తుంది కనుక లాక్ డౌన్ ని ఉపయోగించుకుని డిజిటల్ లో విడుదల చేయాలని చూస్తున్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: