హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో చిరంజీవి తన ఇంటికి మార్పులు చేర్పులు చేసుకుని 100 కోట్ల రూపాయల ఖర్చుతో తన ఇంటిని ఒక ఇంద్రభవనంగా మార్చుకున్నాడు అంటూ ఇప్పటికే మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే చిరంజీవి మాత్రం తన ఇంటి విశేషాలను ఎప్పుడు తన అభిమానులతో షేర్ చేసుకోలేదు. 

 

నిన్న శ్రీరామనవమి సందర్భంగా తన అభిమానులకు శుభాకాంక్షలు తెలియచేస్తూ ఎవరికి వారు తమతమ ఇళ్ళల్లో జాగ్రత్తగా ఉండమని చిరంజీవి సూచనలు ఇచ్చాడు. ఇదే సందర్భంలో చిరంజీవి తన ఇంటిలోని స్విమింగ్ పూల్ కు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ కొన్ని కామెంట్స్ చేసాడు. 

‘అందమైన సన్ రైజ్... ఉదయం లేచాక ఎంత ప్రశాంతంగా ఉందో..  కాలుష్యం లేక సిటీ అందంగా కనిపిస్తోంది.. పక్షుల కిలకిలా రావాలు ఎంతో ఆహ్లాదాన్ని పంచుతున్నాయి.. దీనిని బట్టి చూస్తుంటే మనం ఎంత మిస్సయిపోతున్నామో? ఈ దైనందిన జీవితంతో.. మన భూమిని మనమే పాడు చేసుకుంటున్నాం. కోరి పోగొట్టుకుంటున్నామనిపిస్తోంది. ఇప్పటికైనా రియలైజ్ కావాలి. నేచుర్ ని కాపాడుకోవాలి’ అంటూ కరోనా లాక్ డౌన్ తో బోసిపోయిన భాగ్యనగరంలో అందాలను ఆస్వాదిస్తున్నాడు చిరంజీవి. వాస్తవానికి చిరంజీవికి ప్రకృతి అంటే బాగా ఇష్టం ఆయన ఉదయం నిద్ర లేవగానే తన ఇంటిలోని మొక్కలకు నీరు పెడుతూ ఉన్న ఫోటోలను ఆమధ్య షేర్ చేసి ప్రకృతి పట్ల తనకు ఉన్న ఇష్టాన్ని చాటుకున్నాడు. బయట నిల్చుని సూర్యోదయాన్ని చూపిస్తూ అలాగే ఇంటిని స్విమ్మింగ్‌ పూల్‌ ను కూడ చిరంజీవి చూపెడుతూ తన ఇంద్రభవనాన్ని తన అభిమానులకు పరిచయం చేసాడు. 

 

అయితే ప్రస్తుతం కరోనా విలయతాండవం చేస్తున్న పరిస్థితులలో భాగ్యనగరంలోని చాలామంది పేదలు చేయడానికి పనులు లేక తినడానికి తిండి లేక తెగ ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి పరిస్థితులలో చిరంజీవి ఎంత ప్రకృతి ప్రేమికుడు అయినప్పటికీ బాధలతో ఉన్న జనం కు ఓదార్పు ఇవ్వవలసిన పరిస్థితులలో ఇప్పుడు తన ఇంద్రభవనాన్ని జనంకు పరిచయం చేయవలసిన అవసరం ఉందా అంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: