తెలుగు సినిమా నిర్మాతల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుని స్టార్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్న దిల్ రాజు గత కొన్ని రోజులుగా ఫ్లాప్ సినిమాలనే ఇస్తున్నాడు. ఏడాది మూడు నాలుగు సినిమాలు చేస్తున్న దిల్ రాజుకి గతంలోలా హిట్లు పడటం లేదు. మొన్నటికి మొన్న జాను రూపంలో అతి పెద్ద డిజాస్టర్ వచ్చి పడింది. సాధారణంగా స్ట్రెయిట్ చిత్రాలనే నమ్ముకునే దిల్ రాజు మొదటిసారిగా జాను పేరుతో రీమేకి ని నిర్మించాడు.

 

శర్వానంద్, సమంత జంటగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ఘోరంగా డిజాస్టర్ అయింది. ఆ దెబ్బతో దిల్ రాజుకి బాగా భయం పట్టుకుందట. ఎందుకంటే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో తెరకెక్కిస్తున్న వకీల్ సాబ్ కూడా రీమేక్ సినిమానే. బాలీవుడ్ లో ఘన విజయం సాధించిన పింక్ సినిమాని తెలుగులో వకీల్ సాబ్ గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాన్ ఉన్నాడన్న కారణంగా కొంచెం ధైర్యం ఉన్నప్పటికీ తాను తీయాలనుకున్న మరో రీమేక్ చిత్రాన్ని పక్కన పెట్టేశాడట.

 


బాలీవుడ్ చిత్రమైన బడాయి హో అనే చిత్ర రీమేక్ హక్కులని కొనుక్కున దిల్ రాజు ఆ సినిమాని ముందుగా నాగచైతన్యతో తీద్దామని అనుకున్నాడట. కానీ చైతన్యకి కథ నచ్చక తాను చేయలేనని చెప్పడంతో శర్వానంద్ తో అయినా తీద్దామని భావించాడట. కానీ అంతలోనే శర్వాతో తీసిన జాను రిజల్ట్ రావడంతో ఇక అవసరం లేదని ఊరుకున్నాడట. అంతేకాదు ఇక ఆ సినిమాని పూర్తిగా పక్కన పెట్టేసాడట.

 

ఎక్కువగా స్ట్రెయిట్ చిత్రాలనే తెరకెక్కించే తనకి రీమేక్ అచ్చిరావనే ఉద్దేశ్యంతో ఆ సినిమాని పూర్తిగా పక్కన పెట్టేసాడట. అయితే రీమేక్ తీయడం మంచిదే అయినప్పటికీ పూర్తిగా ఒరిజినల్ లో ఎలా ఉందో అలా దించడం కరెక్ట్ కాదని, తెలుగు ప్రేక్షకులకి తగినట్టుగా దాన్ని మార్చి తీస్తే ఫలితం దక్కుతుందని, జాను సినిమాలో అలా చేయకపోవడం వల్లే ఫెయిల్ అయిందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: