కరోనా వల్ల జనం అంతా గృహ నిర్భందంలో ఉంటున్న నేపద్యంలో ఒటిటి ప్లాట్ ఫామ్ లకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. అమెజాన్ హాట్ స్టార్ లాంటి ఒటిటి ప్లాట్ ఫామ్స్ తో పోటీగా అల్లు అరవింద్ ‘ఆహ’ ను మొదలుపెట్టి రకరకాల వెబ్ సిరీస్ ను ప్రసారం చేయడం మొదలు పెట్టడంతో ఖాళీగా ఉన్న జనం ‘ఆహా’ ను డౌన్ లోడ్ చేసుకుని ప్రస్తుతం ఆహా లో ప్రసారం అవుతున్న కార్యక్రమాలను చూసి తల పట్టుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. 


ఈ ఆహా కు విజయ్ దేవరకొండ బ్రాండ్ అంబాసిడర్ గా ప్రమోట్ చేస్తున్న పరిస్థితులలో ప్రస్తుతం జనానికి దొరికిన ఖాళీ వల్ల అన్ని ఒటిటి ప్లాట్ ఫామ్ లతో సమానంగా ఆహా ను కూడ డౌన్ లోడ్ చేసుకుని జనం ఆహా లో వస్తున్న వెబ్ సిరీస్ ను చూసి పెదవి విరుస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈమధ్యనే భారీ పబ్లిసిటీతో మొదలుపెట్టిన ‘సిన్’ వెబ్ సిరీస్ ను చూసినవారు నిజంగానే తమకు ఏదైనా పాపం ఉంటే ఇలాంటి వెబ్ సిరీస్ ను చూడవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి అంటూ కొందరు కామెంట్స్ వస్తున్నాయి. సెక్స్ సాడిస్ట్ చుట్టూ అల్లబడ్డ ఈ సీన్ వెబ్ సిరీస్ ను కుటుంబ సభ్యులతో చూడటానికి కూడ భయంగా ఉంది అంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు. 


దీనితో కొందరు ‘ఆహా’ ను ఎందుకు డౌన్ లోడ్ చేసుకున్నామా అని మధన పడుతున్నట్లు తెలుస్తోంది. మరికొందరైతే బుల్లితెర పై ప్రసారం అయ్యే చెత్త సీరియల్స్ ఇంతకన్నా బెటర్ అని కామెంట్ చేస్తున్నారు. 


అతి తక్కువ బడ్జెట్ తో ఎటువంటి నిర్మాణ విలువలు లేకుండా కేవలం బూతులతో నింపేసిన ‘సిన్’ అరవింద్ అయినా తన కుటుంబ సభ్యులతో కలిసి చూడగలడా అంటూ విపరీతమైన కామెంట్స్ చేస్తున్నారు. బాలీవుడ్ లో సూపర్ క్లిక్ అయిన ‘లస్ట్ స్టోరీస్’ వెబ్ సిరీస్ లా అడల్ట్ కంటెంట్ తో ఈ సిన్ వెబ్ సిరీస్ బూతుల దండకం లా మారిపోయింది అంటూ చాలామంది చేస్తున్న కామెంట్స్ అసలు అరవింద్ దృష్టి వరకు వచ్చాయ లేదా అన్నదే సందేహం..

 

మరింత సమాచారం తెలుసుకోండి: