అల్లు అర్జున కొడుకు అయాన్ పుట్టినరోజు నేడు జరుగుతోంది. గతంలో బన్నీ నటించిన ‘రేసు గుర్రం’ మూవీ రిజల్ట్ గురించి టెన్షన్ పడుతున్న సమయంలో 2014 ఏప్రిల్ 3న బన్నీ భార్య స్నేహ రెడ్డికి అయాన్ పుట్టాడు. అయాన్ పుట్టిన కొన్నిరోజులకే అతడి ఫోటోలు కేవలం బన్నీ అభిమానుల మధ్య మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో చాలామందిని ఆకర్షించాయి. 


ఆనాటి నుండి అల్లు అర్జున్ ప్రతి సంవంత్సరం తనకొడుకు పుట్టినరోజునాడు అతడికి సంబంధించిన ఫోటోలను తన అభిమానులకు షేర్ చేయడం ఒక అలవాటుగా పెట్టుకున్నాడు. దీనికితోడు అయాన్ కు చిన్నప్పటి నుండి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ పెరగడంతో బన్నీ అభిమానులు ఎప్పటికైనా అయాన్ తన తండ్రిలానే హీరో కావాలని కలలు కంటున్నారు. 


ఈపరిస్థితులలో ఈరోజు బన్నీ తన కొడుకు 6వ పుట్టినరోజు సందర్భంగా ఒక ఫోటోను షేర్ చేస్తూ భావోద్వేగానికి లోనయ్యాడు. తనకు అయాన్ పుట్టే వరకు ప్రేమ విషయం పై పెద్దగా క్లారిటీ లేదని అయితే అయాన్ పుట్టిన తరువాత మాత్రమే తనకు నిజమైన ప్రేమకు అర్ధం తెలిసింది అంటూ ఉద్వేగంతో తన కొడుకుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేసాడు. వాస్తవానికి తన కొడుకు పుట్టినరోజు సందర్భంగా తన సన్నిహితులందరికీ ఒక భారీ పార్టీ ఇవ్వడం బన్నీకి గత 5 సంవత్సరాలుగా కొనసాగుతున్న అలవాటు. 


అయితే ఈ సంవత్సరం కరోనా ఎఫెక్ట్ వల్ల కేవలం తాను తన ఇంటికి ఎవర్నీ పిలవకుండా అయాన్ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం తనకు బాధగా ఉంది అంటూ అల్లు అర్జున్ కామెంట్స్ చేసాడు. దీనితో బన్నీ బాధను తన బాధగా భావిస్తూ చాలామంది అభిమానులు బన్నీకి సంఘీభావం తెలియచేస్తూ అయాన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుయచేస్తున్నారు. సుకుమార్ బన్నీతో తీయబోతున్న లేటెస్ట్ మూవీలో అయాన్ చైల్డ్ ఆర్టిస్టుగా నటిస్తాడు అని వార్తలు వస్తున్న పరిస్థితులలో ఆ వార్తలు నిజం కావాలని బన్నీ అభిమానులు కోరుకుంటున్నారు..   

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: