శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెకక్కిన హ్యాపీడేస్ సినిమా తో వెండితెరకు పరిచయం అయిన నటుడు నిఖిల్ సిద్ధార్థ్. ఆ తరువాత స్వామి రారా, కార్తికేయ, ఎక్కడికి పోతావు చిన్నవాడా లాంటి హిట్స్‌ తో హీరోగా నిలదొక్కుకున్నాడు ఈ యంగ్ హీరో. తాజాగా అర్జున్‌ సురవరం సినిమాతో మరో సూపర్‌ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న నిఖిల్, వ్యక్తిగత జీవితం లోనూ ఓ బిగ్ టర్న్‌ కు రెడీ అయ్యాడు. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు నిఖిల్‌. 

 

ఫిబ్రవరి 1న కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల మధ్య నిఖిల్‌ నిశ్చితార్థం జరిగింది.  ఏప్రిల్‌ 16న హైదరాబాద్‌ లో పల్లవిని పెళ్లాడేందుకు ఏర్పాట్లు కూడా మొదలు పెట్టాడు నిఖిల్. అదే సమయంలో కరోనా అవుట్ బ్రేక్‌తో దేశం అంతా లాక్‌ డౌన్‌లోకి వెళ్లిపోయింది. అంతా ఇంటికే పరిమితమువుతున్నారు. అయితే ఆ సమయంలో కూడా తన పెళ్లిని ఎవరూ ఆపలేరంటూ చెప్పి అందరికీ షాక్ ఇచ్చాడు నిఖిల్.

 

కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. అంతా కంట్రోల్‌ లోకి వచ్చిందనుకుంటున్న సమయంలో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో కరోనా విజృంభించింది. దీంతో నిఖిల్ కూడా పెళ్లి వాయిదా వేసుకోక తప్పని సరి పరిస్థితి ఏర్పడింది. వాయిదా పడినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. దీంతో ఎవ్వరూ నా పెళ్లి ఆపలేరన్నావు కదా.. మరి ఇప్పుడు ఈ వాయిదా ఏంటి అని పెదవి విరుస్తున్నారు ఫ్యాన్స్.

 

కరోనా మహమ్మారితో పోరాడేందుకు శక్తి వంచన లేకుండా కృష్టి చేస్తున్న పోలీసులు, శానిటేషన్ కార్మికులకు తన వంతు సాయం అందిస్తున్నాడు నిఖిల్. తన వంతుగా ఎన్‌ 95 మాస్క్‌ లతో పాటు శానిటైజర్‌లు ఇతర రక్షణ సామాగ్రిని అందిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: