కరోనా మహమ్మారి భారత్ లో ఉగ్ర రూపం దాలుస్తోంది. ప్రజలకు ఇళ్లకే పరిమితమై పోవడంతో ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని చర్యలు తీసుకుంటున్నాయి. కరోనా మహమ్మారిపై పోరుకు ఇప్పటికే ఎందరో టాలీవుడ్ స్టార్ హీరోలు, నిర్మాతలు, నటులు తమ తమ స్థాయిల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విరాళం ప్రకటించారు. ఇప్పుడు నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ కూడా ఈ పోరులో చేతులు కలిపాడు. తన వంతు సాయంగా కోటి రూపాయలను తెలుగు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్ కు విరాళం ప్రకటించాడు.

 

 

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు చెరి 50లక్షల రూపాయల ను విరాళంగా ప్రకటించాడు. అంతే కాకుండా లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన తెలుగు సినీ కార్మికులకు 25లక్షలను కూడా ప్రకటించాడు. చిరంజీవి ఆధ్వర్యంలో ఏర్పాటైన కరోనా క్రైసిస్ చారిటీకి ఈ 25లక్షల చెక్కును అందించి ఆపన్న హస్తం అందించాడు. ఈ చెక్కును నిర్మాత సి.కల్యాణ్ ద్వారా అందజేశాడు. ఇప్పటికే సినీ సెలబ్రిటీలు ఎందరో విరాళాలు ఇవ్వడంతో ఆయా హీరోల అభిమానులు సైతం స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. బాలయ్య కూడా విరాళం ఇవ్వడంతో నందమూరి అభిమానుల్లో ఉత్సాహం రావడం ఖాయం అని చెప్పాలి.

 

 

బాలయ్య అందించిన సాయంపై చిరంజీవి స్పందిస్తూ.. ‘ప్రతి కష్టసమయంలోను, ప్రజలను ఆదుకోవటం కోసం సినీ పరిశ్రమ ఒక్కటిగా ముందుకొస్తే, మీరెప్పుడు తోడుంటారు’ అంటూ బాలయ్యపై ట్విట్టర్ లో ప్రశంసించారు. ఈ విషయంలో తెలుగు సినీ పరిశ్రమ యావత్ భారత సినీ పరిశ్రమకు ఆదర్శంగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. లక్షలు, కోట్ల రూపాయల్లో పీఎం, సీఎం రిలీఫ్ ఫండ్స్ కు విరాళంగా ఇస్తున్నారు. తమను అభిమానించే ప్రజల కోసమే కాకుండా ఇండస్ట్రీలోని కార్మికుల క్షేమం కూడా చూస్తున్న తెలుగు సినీ పరిశ్రమకపై ప్రశంసలు కురుస్తున్నాయి.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

https://tinyurl.com/NIHWNgoogle

 

https://tinyurl.com/NIHWNapple

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: