సినీ ఇండస్ట్రీలో దశాబ్ద కాలం పాటు అగ్రకథానాయకిగా వెలుగొందిన హీరోయిన్ శ్రియా సరన్. ‘ఇష్టం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన శ్రియ తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్, మహేష్‌బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, ప్రభాస్, రవితేజ.. ఇలా స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. దాదాపు రెండు దశాబ్దాలపాటు తెలుగు ప్రేక్షకులను అలరించిన శ్రియ ఈ మధ్య జోరు తగ్గించిందనే చెప్పాలి. యంగ్ జనరేషన్‌ ఎంట్రీతో శ్రియకు అవకాశాలు తగ్గాయి. అయితే ఇప్పటికీ అవకాశం వచ్చినప్పుడు సీనియర్‌ హీరోల సరసన నటిస్తూ మెప్పిస్తోంది ఈ బ్యూటీ. సినిమాల్లోనూ నటిస్తూనే వ్యక్తిగత జీవితాన్ని కూడా ఎంజాయ్ చేస్తోంది. రష్యాకి చెందిన బిజినెస్ మ్యాన్ ఆండ్రీ కొసఛీవ్ వివాహం చేసుకుంది.

 

ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూనే ఆండ్రూతో కలిసి మ్యూజిక్‌ షోస్‌లో పాల్గొంటున్న శ్రియ..సోషల్ మీడియాలో అప్పుడప్పుడు తన ఫోటోలను పోస్ట్ చేస్తూ అందాల ఆరబోతలో కుర్ర హీరోయిన్‌లకు నేను ఏమాత్రం తీసిపోనంటూ గుర్తు చేస్తూ ఉంటుంది. ఇదిలా ఉండగా కరోనా మహమ్మారి కారణంగా ఇప్పుడు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తున్న సంగతి తెలిసిందే. షూటింగులు లేక ఖాళీగా ఉండటంతో ఇంటికే పరిమితమైన సెలెబ్రెటీల రకరకాల ఫొటోలు, వీడియోలతో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాలక్షేపం కోసం తమలో దాగివున్న టాలెంట్ ను బయటకి తీసే పనిలో పడ్డారు. కొంతమంది హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ హీట్ పెంచేస్తూ ఉంటే, మరికొందరు తమ రోజువారీ కార్యక్రమాలను వీడియోలను తమ అభిమానుల కోసం సోషల్ మీడియాలో పోస్ట్ చేసి టైమ్ పాస్ చేస్తున్నారు. అలాగే కరోనాపై పోరాటానికి ప్రజలను చైతన్యవంతులను చేయడానికి పలు కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు.

 

ఈ క్రమంలోనే సీనియర్ హీరోయిన్‌ సొట్టబుగ్గల శ్రియ సరికొత్త ఛాలెంజ్‌కు శ్రీకారం చుట్టింది. ఈ హాట్ బ్యూటీ తన భర్త అండ్రీ కొచ్చివ్ కిచెన్‌లో వంట పాత్రలను శుభ్రం చేస్తున్న ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్‌ చేస్తూ.. ఈ 'బర్తన్‌ సాఫ్‌ కరో' చాలెంజ్‌ను విసిరింది. ఈ ఛాలెంజ్ స్వీకరించాల్సిందిగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, తమిళ యంగ్ హీరో ఆర్యలతో పాటు పలువురిని నామినేట్‌ చేశారు. వారి అందమైన భార్యల కోసం పాత్రలు శుభ్రం చేసిపెట్టాలని ఈ సందర్భంగా శ్రియ ఛాలెంజ్‌ విసిరింది. శ్రియా శరన్ విసిరిన ఈ ఛాలెంజ్ పై బన్నీ, ఆర్య ఎలా స్పందిస్తారో చూడాలి. కుర్ర హీరోయిన్‌లతో సమానంగా అందాలను ఆరబోస్తూ, వెండితెరపై తనకంటూ ప్రత్యకత తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ విసిరిన ఈ 'బర్తన్‌ సాఫ్‌ కరో' ఛాలెంజ్ ఇప్పుడు ట్రెండ్ కాబోతోందో లేదో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: