ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం ఈ కరోనా రక్కసి విపరీతంగా కోరలు చాస్తుండడంతో దేశ దేశాలు అన్ని కూడా ఎంతో గజ గజ వణికిపోతున్నాయి. దాదాపుగా వంద ఏళ్ళ తరువాత ప్రపంచం అంతా ఈ కరోనా ఎఫెక్ట్ తో ప్రస్తుతం వణికిపోతోంది. ఇక ఈ వ్యాధిని మరింతగా వ్యాప్తి కానివ్వకుండా ఉండేలా ఇప్పటికే మన దేశంతో పాటు ప్రపంచంలోని దాదాపుగా అన్ని దేశాలు కూడా లాకౌట్ ప్రకటించి ప్రజలను బయటకు రానీయకుండా పూర్తిగా తమ ఇళ్లకు పరిమితం చేయడం జరిగింది. ఏదైనా అత్యవసర పరిస్థితి, అలానే సరుకులు, పాలు వంటి వాటి కోసమే బయటకు రావాలని, అది కూడా ప్రతి ఇంటి నుండి ఒక్కరు మాత్రమే రావాలని ప్రభుత్వం సూచనలు చేయడం జరిగింది. 

 

ఇక ఈ లాకౌట్ ప్రభావం వల్ల ఎక్కడి ప్రజలు అక్కడే ఇళ్లలో ఉండిపోవడంతో అనేక రంగాలు ప్రస్తుతం కొంత దెబ్బతినే పరిస్థితికి వచ్చాయి. ఇక దీని ప్రభావం హైదరాబాద్ లోని ఫిలిం సిటీ పై కూడా బాగానే పడిందని సమాచారం. వాస్తవానికి నిత్యం ఎంతో మంది విజిటర్స్ తో పాటు ఎన్నో సినిమాల షూటింగ్స్ తో కళకళ లాడే ఫిలిం సిటీ, ప్రస్తుతం ఎవ్వరూ లేక ఎంతో బోసి పోతోందని, అది మాత్రమే కాక ఒకేసారి 14, 15 సినిమాల షూటింగ్‌లు రోజూ ఫిలిం సిటీ లో జరిగేవని, ఇక ఆ లాకౌట్ ప్రభావంతో వాటి నుండి వచ్చే దాదాపుగా కోట్లాది రూపాయల రెవెన్యూ ని కోల్పోవాల్సిన పరిస్థితులు తలెత్తాయని అంటున్నారు. 

 

కేవలం అవసరం మేరకు ముఖ్యమైన సిబ్బంది మాత్రమే ప్రస్తుతం అక్కడ ఉన్నారని, మరొక 15 రోజుల వరకు ఈ లాకౌట్ కొనసాగనుండడంతో ఫిలిం సిటీ కి దీనివలన వచ్చే నష్టం తలచుకుంటే నిజంగా దిమ్మతిరగడం ఖాయం అని అంటున్నారు. అయినప్పటికీ ప్రస్తుతం ప్రజలు అందరూ ఎవరికి వారు ఇళ్లకు పరిమితం అయి సోషల్ డిస్టెన్స్ పాటిస్తేనే బెటర్ అని, లాభ నష్టాల విషయం అటుంచితే, మనిషి ప్రాణాల కన్నా అవి అంత ముఖ్యం కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: