ప్రస్తుతం మహమ్మారి కరోనా ఎఫెక్ట్ తో ఇప్పటికే మన భారత దేశంతో పాటు పలు ఇతర దేశాలు సైతం కొన్ని వారాల పాటు లాకౌట్ ప్రకటించి తమ తమ దేశ ప్రజలను పూర్తిగా ఇళ్లకు పరిమితం చేసి బయటకు రానీయకుండా చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ప్రజల మధ్య సోషల్ డిస్టన్సింగ్ అనేది మెయిన్టెయిన్ చేయడం వలన కరోనా వ్యాధి ఒకరి నుండి మరొకరికి వేగంగా వ్యాప్తి చెందడాన్ని అరికట్టవచ్చని ప్రభుత్వాలు ఈ విధంగా వ్యవహరించడం జరిగింది. అలానే ఇదివరకు మాదిరిగా ఒకరికి మరొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం, అలానే హగ్ చేసుకోవడం వంటివి కూడా చేయకుండా, మన భారతీయ సంప్రదాయం ప్రకారం నమస్కారం పెట్టాలని పలువురు సూచిస్తున్నారు. 

 

అది మాత్రమే కాక అవకాశం ఉన్నంతవరకు ఎట్టిపరిస్థితుల్లో ఇళ్ల నుండి బయటకు రావద్దని, తప్పనిసరి పరిస్థితుల్లో అది కూడా ఇంటి నుండి ఒక్కరు మాత్రమే బయటకు వెళ్లడం మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు. ఇక ఈ లాకౌట్ వలన ఎందరో ప్రజలు ఉపాధిని కోల్పోయి పూర్తిగా ఇంటి వద్దనే కాళ్ళు ముడుచుకుని ఉండవలసిన పరిస్థితులు రావడం, దీనివల్ల ముఖ్యంగా దిగువ వర్గాల వారికి తినడానికి తిండి కూడా లేని పరిస్థితులు తలెత్తుతున్నాయి. అయితే అటువంటి వారి కోసం ప్రభుత్వాలు సహా పలువురు ప్రముఖులు సైతం తమ వంతుగా ఆర్ధిక సాయాన్ని అందించేందుకు ముందుకు వస్తున్నారు. 
ఇక ప్రస్తుతం ఈ ఎఫెక్ట్ సినిమా ఇండస్ట్రీ పై కూడా బాగానే ప్రభావం చూపుతోంది.

 

కొన్నాళ్లుగా షూటింగ్స్ పూర్తిగా బంద్ కావడంతో రోజువారీ పని చేసే జూనియర్ ఆర్టిస్టులు అయితే రోడ్డున పడే పరిస్థితులు తలెత్తాయని, అందులో మరికొందరి పరిస్థితి అయితే మరింత దయనీయంగా ఉందని సమాచారం. అయితే అటువంటి వారి కోసం సినిమా పరిశ్రమ వారు తమవంతుగా సాయం చేయడానికి సిద్ధం అయ్యారు. ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తుంటే ఈ నెల 15 వ తేదీ వరకు కూడా ఈ లాకౌట్ తప్పదు కనుక అప్పటి వరకు తమను ఆదుకుంటే బాగుంటుందని పలువురు జూనియర్ ఆర్టిస్టులు కోరుతున్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: