చైనా దేశంలో పుట్టిన కరోనా వైరస్ ఎఫెక్ట్ ప్రపంచ దేశాలలో ఉన్న అన్ని రకాల ప్రజలపై బాగా ప్రభావం చూపుతుంది. ఈ వైరస్ ని ఎదుర్కోవటానికి అభివృద్ధి చెందిన దేశాలు ఏం చేయలేని పరిస్థితి నెలకొనడంతో భూమి మీద ఉన్న మానవ మనుగడకు ఇదొక ప్రమాదకరంగా మారింది. ఇటువంటి టైం లో ఇండియాలో కూడా వైరస్ ప్రభావం ఉన్న కొద్దీ ప్రబలుతున్న తరుణంలో అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం 21 రోజుల పాటు లాక్ డౌన్ అమలులోకి తీసుకు రావడం జరిగింది. దీంతో దేశ ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు, అన్నీ కూడా మూతపడ్డాయి. అంతేకాకుండా సినిమా షూటింగులు కూడా ఆగిపోయాయి.

 

ఇటువంటి తరుణంలో కరోనా ఎఫెక్ట్ తో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివకి దెబ్బ మీద దెబ్బ తగిలింది అని ఇండస్ట్రీలో వార్తలు గట్టిగా వినబడుతున్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన సినిమాలు ఇప్పటి వరకు ఏదీ కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడలేదు. అంతేకాకుండా అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లే. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన చివరి సినిమా భరత్ అనే నేను. సినిమా సూపర్ డూపర్ హిట్ కావటం మహేష్ కెరీర్లోనే భారీ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా నిలిచిపోయింది.

 

ఆ తర్వాత చిరంజీవితో సినిమా ఓకే చేసిన కొరటాల కి...దాదాపు ఆ టైంలో చిరంజీవి సైరా సినిమా షూటింగ్ లో ఉండటంతో ఏడాది పాటు వెయిట్ చేశారు. అయితే అంతా సైరా సినిమా హడావిడి అయిపోయిన తర్వాత ఇటీవల చాన్నాళ్ల తర్వాత కొరటాల చిరంజీవి సినిమా నీ పట్టా లెక్కించారు. ఇంతలోనే కరోనా వైరస్ రావటంతో సినిమా షూటింగ్ ఆగిపోవడంతో దాదాపు ఏడాది గ్యాప్ వచ్చిన కొరటాల కి ఈ వైరస్ దెబ్బకి కోలుకోలేని పెద్ద దెబ్బ తగిలిందని ఇండస్ట్రీలో టాక్. 

మరింత సమాచారం తెలుసుకోండి: