కరోనా వైరస్ తో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసినదే. ఉద్యోగం , కంపెనీ , వ్యాపారం ఇలాంటివి అన్నీ కూడా పక్కన పెట్టి కేవలం ఇళ్ల ల్లోనే కూర్చోవాల్సిన దుస్థితి ఏర్పడింది. అయితే బ్రతుకు నడవాలంటే పొట్ట నిండాలి . దానికి కాస్త డబ్బులు ఉండాలి. పైగా ప్రతీ ఒక్కరికీ డబ్బు అత్యవసరం .

 

డబ్బు చేతికి వస్తే ఇది చెయ్యాలి? అది చెయ్యాలి? అని ఎంతో మంది అనేక పనులు పెట్టుకుంటారు. చేతిలో డబ్బు రాక పనులు పూర్తి కాక పోతే పడే బాధ అంతా ఇంతా కాదు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఘోరం అనే చెప్పాలి. ప్రతీ ఒక్కరూ కూడా వల్ల ఉద్యోగాల నుండి దూరమై ఇళ్లల్లోనే ఉంటున్నారు. సినిమాలు కూడా షూటింగ్స్ ఆపేసి లాక్ డౌన్ లోనే సినిమా హీరోలు, టెక్నీషన్స్ ఇలా ప్రతీ ఒక్కరూ కూడా ఇళ్లల్లోనే ఉంటున్నారు .

 

కరోనా కి చెక్ పెట్టే వరకు కూడా ఇది ఇలానే ఉంటుంది. సినిమా లో అనేక మంది కార్మికులు కూడా పని చేస్తారు. వాళ్ళ పరిస్థితి కూడా దారుణం అనే చెప్పాలి . స్టంట్ డైరక్టర్ , ఆర్ట్ డైరెక్టర్, ఎడిటింగ్,  డబ్బింగ్, స్క్రిప్ట్ రైటర్, ప్రొడక్షన్ విమెన్, సినిమా డ్రైవర్స్, మ్యూజిక్ డైరక్టర్, ప్రోడాల్క్షన్ ఎక్సిక్యూటివ్, టెక్నీకల్ యూనిట్, స్థూడియో వర్కర్స్ ఇలా మొత్తం 24 క్రాఫ్ట్స్ లో ఉండే ప్రతీ ఒక్కరూ కూడా షూటింగ్స్ లేని కారణంగా  దుస్థితి లో ఉన్నారు.

 

 

ఇలా వీటిల్లో ఉండే కార్మికులు అంతా కూడా సినిమాలు ఎప్పుడు మళ్ళీ ప్రారంభం అవుతాయి అని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. తిరిగి పనిలో పడిపోవాలని వారు అనుకుంటూ వెయిట్ చేస్తున్నారు .  

మరింత సమాచారం తెలుసుకోండి: