హాలీవుడ్ గాయని నటి జెన్నీఫర్ లోపెజ్‌, ఆమె ఫియాన్సీ అలెక్స్‌ రొడ్రిగ్జ్‌ తాజాగా వాళ్లు రెగ్యులర్‌గా వెళ్లే జిమ్ దగ్గర కెమెరా కంట్లో పడ్డారు. అయితే ప్రస్తుతం అక్కడ కరోనా ప్రభావం కారణంగా జిమ్‌ మూసివేసినా జెన్నీఫర్‌ కోసం దాన్ని ప్రత్యేకంగా తెరిచారు. ఈ నేపథ్‌యంలో ఆ జంట జిమ్ వెనుక గేటు నుంచి బయటకు వస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే వారికి ప్రత్యేకంగా పర్మిషన్‌ ఇచ్చారన్న ప్రచారం జరుగుతోంది.

 

అయితే జెన్నీ బయటకు వస్తుండగా అక్కడ ఉన్న డోర్ మీద ఈ జిమ్‌ మూసివేశారు. ఇంట్లో ఉండడి, జాగ్రత్తగా ఉండండి అంటూ రాసిఉంది. దీంతో వారు జిమ్‌ కు లాక్ డౌన్‌ అమలవుతున్న సమయంలోనే వాళ్లారన్న విషయం స్పష్టమవుతుంది. గతంలో వారు  రెగ్యులర్‌గా ఇదే జిమ్‌ కు వెళ్లేవారు కానీ కొద్ది రోజులుగా ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితులు అనుకూలంగా లేవు. ఈ నేపథ్యంలో వారు జిమ్‌ కు వెళ్లటం వివాదాస్పదమవుతోంది.

 

జిమ్‌ నుంచి బయటకు వస్తున్న సమయంలో జెన్నీఫర్‌ స్పోర్ట్స్ బ్రా, హై వెస్ట్‌ లెగ్గింగ్స్ వేసుకొని వాటర్‌ బాటిల్‌ పట్టుకొని ఉండటంతో వారు వర్క్ అవుట్స్ చేసేందుకే జిమ్ కు వచ్చారని భావిస్తున్నారు. వారు జిమ్ నుంచి బయటకు వస్తుండగా ఫేస్ మాస్క్ ధరించిన వ్యక్తి వారికి సెడాఫ్‌ ఇవ్వటం తో వారు ప్రత్యేకంగా నిర్వహకుల అనుమతి తీసుకొని జిమ్‌ కు వచ్చినట్టుగా భావిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: