జూనియ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం రణం.. రుధిరం.. రౌద్రం హేంగోవర్ లో వున్న సంగతి అందరికి తెలిసినదే. సూపర్ డూపర్ కాస్టింగ్ రాజమౌళి, రాంచరణ్, ఎన్టీఆర్, అజయ్ దేవగన్, అలియా భట్, కీరవాణి... ఇలా భారీ తారాగణంతో తెరెకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే వున్నాయి.. ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ అండ్ రాంచరణ్ బర్త్ డే గిఫ్ట్ లో ఎన్టీఆర్ ఓవర్ ఓవర్ తో కూడిన వీడియో.. అంచనాలను మరింత పెంచేసింది.

 

ఇక అసలు విషయానికొస్తే... ఎన్టీఆర్ సినీ జీవితం చూసుకుంటే టెంపర్ కు ముందు.. తరువాత అన్నమాదిరి ఉంటుంది... టెంపర్ కు ముందు దాదాపు ఫెయిల్యూర్ తో వున్న ఎన్టీఆర్ కు టెంపర్ ఇచ్చిన బ్రేక్ అంతా ఇంతా కాదు.. టెంపర్ తరువాత అయన తిరిగి వెనక్కి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది. 50 60 కోట్ల మార్కెట్ వున్న హీరో కాస్త, 100 కోట్ల క్లబ్ లోకి చేరాడు. గత 5 ఏళ్లలో చూసుకుంటే ఎన్టీఆర్ చేసిన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్లే.

 

rrr తరువాత..  ఎన్టీఆర్ దాదాపుగా మూడు.. నాలుగు సినిమాలను లైన్ లో పెట్టేసాడు. అందులో ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో చేయబోయే సినిమా... ఇప్పటికే ఈ సినిమాపై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. జూన్ లేదా జులై నెలలో ఈ సినిమా పట్టాలెక్కనుండగా.. హారిక హాసిని, నందమూరి తారకరామారావు ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం విశేషం. అంతవరకూ బాగానే వుంది కానీ... ప్రస్తుత కరోనా వాతావరణంలో సినిమా ఆలస్యం కానుందని సమాచారం.

 

దాని తరువాత.. కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా లైన్ లో ఉండగా.. దీన్ని కొర‌టాల స్నేహితుడు నిర్మాత‌గా ఉండబోతున్నట్లు ఆ మధ్య వార్తలొచ్చాయి. అలాగే.. తమిళ దర్శకుడు అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌బోతున్నాడు మన జూనియర్. ఇకపోతే... ఆ మధ్య కెజియ‌ఫ్ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్‌తో కూడా ఓ సినిమా చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కెర్లు కొట్టాయి... ఇక ఏది ఎలావున్నా.. ప్రస్తుతం కరోనా ఎన్టీఆర్ సినీ జీవితాన్ని ఒక్కసారిగా డైలమాలో పడేసింది... ఒకవైపు ఆగిపోయిన rrr ... కమిట్ అయిన వరుస ప్రాజెక్టులు అయోమయంగా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: