దేశంలో రోజు రోజుకీ పెరిగిపోతున్న కరోనా మహమ్మారిని అరికట్టడానికి లాక్ డౌన్ పాటిస్తున్న విషయం తెలిసిందే.  ఆ మద్య ప్రధాని పిలుపు మేరకు ‘జనతా కర్ఫ్యూ’ పాటించిన విషయం తెలిసిందే. మరోసారి ఏప్రిల్ 5వ తేదీన ఆదివారం రోజు కరోనా చీకట్లను తరిమేయాలి అంటూ పిలుపునిచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ... ఆ రోజు రాత్రి 9 గంటల నుంచి 9 నిమిషాల పాటు లైట్లు ఆపేయాలని పిలుపునిచ్చిన ప్రధాని.. అదే సమయంలో కొవ్వొత్తులు, దీపాలు, లేదా మొబైల్ ఫ్లాష్ లైట్లు ఆన్ చేయండి.. కరోనా చీకట్లను తరిమేయాలి.. ఎవరు, ఎక్కడ ఉన్నా లైట్లు ఆపేయాలి అంటూ పిలుపునిచ్చారు ప్రధాని నరేంద్రమోదీ.

 

 తాజాగా ప్రధాని  పిలుపుపై ప్రముఖ హీరో చిరంజీవి స్పందించారు. మన ప్రియతమ ప్రధాని మోదీ పిలుపును గౌరవిద్దామని, అందరం దీపాలు ముట్టిద్దామంటూ తన పోస్ట్ లో పేర్కొన్నారు. ‘కరోనా’ చీకట్లను పారద్రోలదామని, దేశం కోసం  ఒకరికోసం ఒకరు నిలబడదామని పునరుద్ఘాటిద్దామని ప్రజలకు సూచించారు. ఇప్పుడు కరోనా పరిస్థితి దేశంలో దారుణంగా ఉందని.. తెలుగు రాష్ట్రాల్లో కూడా రోజు రోజుకీ దీని ప్రభావం తీవ్ర తరం అవుతుందని అన్నారు.  ఇప్పుడు దేశాన్ని రక్షించుకునే బాధ్యత సామాన్య పౌరుల నుంచి సెలబ్రెటీల వరకు ఉందని అన్నారు.

 

 దేశంలో కరోనాని రూపు మాపడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతగానో కృషి చేస్తున్నాయని అన్నారు.  కరోనాపై యుద్ధానికి అందరూ బాగా సహకరిస్తున్నారన్నఇలా చేయడం వల్ల ప్రతీ ఒక్కరు ఇంట్లోనే ఉంటే కరోనాను జయించినట్టేనని.. ఐక్యంగా పోరాడితే కరోనాపై విజయం సాధిస్తామన్నారు.  ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభిస్తోంది... రాష్ట్రవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య161 కి పెరిగిపోయింది.  తెలంగాణలో 154 కేసులు నమోదు అయ్యాయి.  ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా కొంత మంది లాక్ డౌన్ ఉల్లంఘన చేస్తూనే ఉన్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: