ఇప్పుడు రావిపూడి చేస్తున్న ఎంటర్టైనర్ మూవీస్ ఒకప్పుడు శ్రీను వైట్ల చేసేవాడు. కమర్షియల్ సినిమాలకు కామెడీ టచ్ ఇచ్చి సినిమా సూపర్ హిట్ కొట్టడంలో శ్రీను వైట్ల తర్వాతే ఎవరైనా అనుకునేవారు. అయితే ఇప్పుడు ఆ ఛాన్స్ అనీల్ రావిపూడి కొట్టేశాడు. పటాస్ నుండి సరిలేరు నీకెవ్వరు వరకు వరుస హిట్లతో దూసుకెళ్తున్నాడు అనీల్ రావిపూడి తన నెక్స్ట్ సినిమా ఎఫ్-2 సీక్వల్ ఎనౌన్స్ చేసి అందరికి షాక్ ఇచ్చాడు. త్వరలోనే ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్లబోతుందని తెలుస్తుంది. 

 

అయిదు శ్రీను వైట్ల మాత్రం చేతిలో సినిమాలు లేక ఖాళీగా ఉన్నాడు. అమర్ అక్బర్ ఆంటోని తర్వాత శ్రీను వైట్లని నమ్మి సినిమా చేసేందుకు హీరోలెవరు ముందుకు రాలేదు. శ్రీను వైట్ల ఢీ సీక్వల్ చేసే ఆలోచనలో ఉన్నాడని కొద్దిరోజులుగా వినిపిస్తున్న వార్త. శ్రీను వైట్ల, మంచు విష్ణు కాంబినేషన్ లో వచ్చిన ఏ సినిమా సూపర్ సక్సెస్ అయింది. మంచు విష్ణుకి మొదటి కమర్షియల్ హిట్ ఈ సినిమానే. ప్రస్తుతం ఏమాత్రం ఫామ్ లో లేని శ్రీను వైట్లకు మరో ఛాన్స్ ఇస్తున్నాడట మంచు విష్ణు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే ఈ సినిమాకు శ్రీను వైట్లతో కలిసి రైటర్ కోనా వెంకట్ కూడా కలిసి పనిచేస్తారని తెలుస్తుంది. 

 

శ్రీను వైట్ల కోనా వెంకట్ కాంబో అంటే సూపర్ హిట్ అన్నట్టే లెక్క. ఇద్దరి మధ్య ఏవో గొడవలు వచ్చి ఎవరి దారి వారు చూసుకున్నారు. కోనా వెంకట్ దూరమయ్యాక శ్రీను వైట్ల హిట్ కు దూరమయ్యాడు. కోనా వెంకట్ చిన్నగా ఒక ప్రొడక్షన్ ఓపెన్ చేసుకుని అందులో సినిమాలు చేస్తున్నాడు. మళ్ళీ శ్రీను వైట్ల, కోనా వెంకట్ కలిసి పనిచేస్తే మాత్రం ఆ ప్రాజెక్ట్ కు మంచి క్రేజ్ ఏర్పడుతుంది. తప్పకుండా అది మంచి విజయాన్ని అందుకుంటుందని చెప్పొచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: