కరోనా వైరస్ దెబ్బకి బుల్లితెర, వెండితెర షూటింగులు అన్ని ఆగిపోయాయి. అక్కినేని నాగార్జున యొక్క అన్నపూర్ణ స్టూడియో లో కూడా ఎటువంటి ప్రోగ్రాములు, కార్యక్రమాలు, సీరియల్ షూటింగులు జరగడం లేదు. దాంతో నాగార్జున కి సగటున ఇప్పటివరకు రూ. 3 కోట్ల నష్టం వాటిల్లిందని తెలుస్తుంది. నాగార్జున వరుస ప్లాప్ సినిమాల తో సతమతవ్వడం, అక్కినేని అఖిల్ కూడా డిసాస్టర్ కా బాప్ అనే పేరు సంపాదించడం... అతని నెక్స్ట్ సినిమా షూటింగ్ ఒకటిన్నర ఏడాది నుండి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ముందుకు సాగకపోవడం, నాగ చైతన్య తదుపరి సినిమా చిత్రీకరణ మధ్యలోనే ఆగిపోవడం ప్రస్తుతం అక్కినేని కుటుంబాన్ని కలవరపెడుతుంది.


కరోనా వైరస్ ప్రభావం ఇంకా ఎన్ని రోజులు ప్రజలపై ఉంటుందో కూడా తెలియదు. తాను తీస్తున్న వైల్డ్ డాగ్ చిత్రీకరణ కూడా ఇప్పట్లో జరగదని తెలుస్తుంది. మన్మథుడు సినిమా అట్టర్ ప్లాప్ అవ్వడం తో బాగా నిరాశచెందిన నాగార్జున హిట్ కొట్టాలనే ఆశతో ఉన్నా... కోవిడ్ 19 కారణంగా అతని వైల్డ్ డాగ్ సినిమా షూటింగ్ కూడా ఆగిపోయింది. దీంతో కరోనా వైరస్ వల్ల తనకు ఎంతో కష్టం... డబ్బు నష్టం వాటిల్లుతుందని తెలుస్తుంది.


తన సినీ కెరీర్ అంత లాభసాటిగా లేకపోయినా నాగార్జున మాత్రం ఇటీవల పేద సినీ కార్మికుల కోసం ఏకంగా కోటి రూపాయలను విరాళంగా ఇచ్చి తన గొప్ప మనసుని చాటుకున్నాడు. 2021 ఏడాది అయినా నాగార్జున కుటుంబానికి డబ్బు పరంగా కలిసి వస్తుందో లేదో చుడాలిక. ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వం లో తెరకెక్కుతున్న పిరియాడిక్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీ సినిమా యొక్క సెట్ల ని అన్నపూర్ణ స్టూడియో లో వేసినట్లు సమాచారం. లాక్ డౌన్ పూర్తిగా ఎత్తివేస్తే ప్రభాస్ సినిమా షూటింగ్ వల్ల, సీరియల్స్ షూటింగ్స్ వల్ల డబ్బులు వచ్చే అవకాశం ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: