జూనియర్ ఎన్టీయార్ కి టాలీవుడ్లో ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే. యంగ్ హీరోల్లో టాప్ రేంజిలో ఉన్నాడు. ఎన్టీయార్ నటించిన అరవింద సమేత మూవీ రిలీజ్ అయి దాదాపుగా రెండేళ్ళు కావస్తోంది. ఆ తరువాత మళ్ళీ కొత్త మూవీ విడుదల కాలేదు. ఇపుడు ఆర్.ఆర్.ఆర్ మూవీలో పవర్ ఫుల్ రోల్లో యాక్ట్ చేస్తున్నాడు.

 

ఇక జూనియర్ కి తెలుగులో పాటు సౌత్ ఇండియాలో మంచి మార్కెట్ ఉంది. దాన్ని యూజ్ చేసుకోవడానికి రౌద్రం, రణం, రుధిరం డైరెక్టర్ రాజమౌళి చూస్తున్నాడు. ఆర్.ఆర్.ఆర్ మళయాళం వెర్షన్ లో తన పాత్రకు ఎన్టీయార్ చేత డబ్బింగ్ చెప్పించాలని చూస్తున్నాడు. 

 

దానికి జూనియర్ కూడా సై అంటున్నాడుట.  ఏ సవాల్ కి అయినా జవాబు ఇచ్చే జూనియర్ ఇపుడు మళయాళ మూవీకి తన పాత్ర కోసం మళయాళం నేర్చుకుంటున్నాడుట. అక్కడ ఎన్టీయార్ గంభీరమైన గొంతుకతో డైలాగ్ చెబితే ఆ ఊపే వేరుగా ఉంటుందనడంలో ఎటువంటి డౌట్ లేదు.

 

ఇప్పటికే జూనియర్ తెలుగు, తమిళం, కన్నడంలో డబ్బింగ్ చెప్పాడు. రాం చరణ బర్త్ డేకి వచ్చిన సర్ప్రైజ్ వీడియోలో అన్ని భాషల్లో డబ్బింగ్ చెప్పిన జూనియర్ ఒక్క మళయాళాన్నే అలా వదిలేశాడు. మరి ఆ భాషను కూడా నెర్చుకుని జూనియర్ తన సత్తా చాటుతాడని అంటున్నారు.

 

ఇక జూనియర్మూవీ తరువాత త్రివిక్రం మూవీలో నటించేందుకు కూడా రెడీ అయ్యాడు. ఆ మూవీలో ఆయన పక్కన పూజా హెగ్డేవా. లేక రష్మిక అన్నది తేలాల్సిఉంది. ఇక ఆర్.ఆర్.ఆర్ తో మార్కెట్ బాగా పెంచుకున్న ఎన్టీయార్ త్రివిక్రం మూవీ కూడా మళయాళంలో డైరెక్ట్ గా రిలీజ్ చేస్తారన్న మాట కూడా ఉంది. చూడాలి మరి ఈ మళయాళం జూనియర్ ని ఎంతవరకూ తీసుకువెళ్తుందో.

 

మరింత సమాచారం తెలుసుకోండి: