రామ్ గోపాల్ వర్మలో ఈ మధ్య ఎక్కడ లేని సామాజిక స్పృహ కనిపిస్తోంది. ఎప్పుడూ ఎవరేమైపోతే నాకేంటి నా ఆనందం నాకు ముఖ్యం అన్నట్లు వ్యవహరించే వర్మ.. కరోనా వైరస్ కలకలం మొదలైన దగ్గర్నుంచి భిన్నంగా ప్రవర్తిస్తున్నాడు. ఈ వైరస్ గురించి జనాల్లో అవగాహన పెంచే ప్రయత్నం చేస్తున్నాడు. కొన్నిసార్లు తనదైన శైలిలో కామెడీ చేస్తున్నప్పటికీ, కొన్నిసార్లు సీరియస్‌గా జనాల్లో అవగాహన పెంచే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆయన కరోనా మీద ఒక పాట రాసి పాడేశాడు. సడన్ గా నాకు కరోనా పాజిటివ్ అంటూ అందర్నీ షాక్ కి గురి చేసాడు. ఇప్పుడే తన డాక్టర్ ఫోన్ చేసి నీకు కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిపాడు అంటూ ట్వీట్ చేసాడు వర్మ. లాక్ డౌన్ కారణంగా ఇంట్లోంచి అడుగు కూడా బయటికి పెట్టడం లేదు. అంతలోనే ఈయనకు కరోనా పాజిటివ్ రావడం ఏంటి అనుకున్నారు నెటిజన్లు.

 

అంతా షాక్ అవుతున్న వేళ 'ఏప్రిల్ ఫూల్' అంటూ ఆయనలోని సైకో నిద్ర లేచాడు. ఆ ట్వీట్ చేసిన 15 నిమిషాలకు 'సారీ అందర్నీ డిజప్పాయింట్ చేసాను.. నాకు కరోనా లేదంట.. నా డాక్టర్ నన్ను ఏప్రిల్ ఫూల్ చేసాడు.. ఇది నా తప్పు కాదు ఆయనదే' అంటూ మరో ట్వీట్ చేసాడు. అంతకుముందు కరోనా వచ్చింది భార్యల వల్లనే అంటూ, రజినీకాంత్ లాంటి స్టార్ హీరో కరోనాని ఆపలేడా అంటూ... రకరకాల ట్వీట్స్ తో ట్విట్టర్ ని హోరెత్తించాడు.

 

ఇప్పుడు తాజాగా నాకు ఈ వైరస్ గురించి రెండేళ్ల క్రితమే తెలుసు.. అప్పట్లో నేను ఈ వైరస్ గురించి స్క్రిప్ట్ కూడా రెడీ చేసుకున్నాను అంటూ ట్వీట్ చేసిన డేట్ తో సహా ట్వీట్ చేసాడు. అయితే వాస్తవానికి రామ్ గోపాల్ వర్మ చెప్పింది నిజమే. రెండేళ్ల క్రితం 'వైరస్' అనే పేరుతో సినిమా తీస్తున్నానని, సర్కార్, 26/11 సినిమాలను నిర్మించిన వారే ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారంటూ ట్వీట్ చేసాడు. ఈ 'వైరస్' సినిమా పట్టాలెక్కనప్పటికీ 'కరోనా వైరస్' మాత్రం మన మీదకెక్కి కూర్చుంది. రామ్ గోపాల్ వర్మ దేవుడని, బ్రహ్మంగారిలా కాలజ్ఞానం కూడా చెప్తాడు అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు నిజంగానే రెండేళ్ల క్రితమే ఆర్జీవికి ఎలా తెలుసు అని ఆలోచిస్తున్నారు. 

 

https://twitter.com/RGVzoomin/status/1245975639988920321?s=20

మరింత సమాచారం తెలుసుకోండి: