కరోనా వైరస్ వ్యాప్తి లో ప్రస్తుతం భారతదేశం లో మిగతా రాష్ట్రాల కన్నా ఎక్కువ కేసులతో ముందుకు  దూసుకొనిపోతున్నాయి రెండు తెలుగు రాష్ట్రాలు. ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో వందలాది కేసులు నమోదు కాగా తబ్లిజి జమాత్ కు హాజరైన ముస్లింలు రెండు తెలుగు రాష్ట్రాల నుండి ఎక్కువగా ఉండటం తో ఆయా ప్రభుత్వాలు పై అదనపు భారం పడింది అనే చెప్పాలి. వైరస్ శ్వాస సంబంధిత అవయవాలపై తన ప్రభావం చూపిస్తుంది కానీ దీని బారిన పడిన కొంతమందిమాత్రం చాలా విచక్షణరహితంగా ప్రవర్తిస్తున్నారు.

 

తమకు వైరస్ సోకితే మిగతా వారు కూడా దానికి మూల్యం చెల్లించాలి అనే ఉద్దేశంతో ఇతరులపై ఉమ్మడం మరియు కావాలని వెళ్లి వారిని ఇబ్బంది పెట్టడం వంటి పనులు చేస్తున్నారు. ఇక హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో కొంతమంది అజ్ఞానులు వైద్యులపై దాడికి పాల్పడిన విషయం కూడా బయటకు వచ్చింది. ఆసుపత్రిలోని డాక్టర్లకు పోలీస్ సెక్యూరిటీ ఏర్పాటు చేయడం కూడా జరిగింది.

 

ప్రస్తుతం భారతదేశం తరఫున యుద్ధం చేస్తున్నది బోర్డర్ లో ఉన్న ఆర్మీ కాదు తెల్లకోటు వేసుకున్న వైద్యుడు. ఇటువంటి కీలకమైన సమయంలో భారత్ ప్రజలను కాపాడటం కోసం వైద్యులు తమ కుటుంబాలను పక్కనపెట్టి చాలా రిస్క్ చేసి మరి పని చేస్తున్నారు.

 

సమయంలో ఓల్డ్ సినీ దర్శకుడు హరీష్ శంకర్ సోషల్ మీడియా ద్వారా ఒక అద్భుతమైన ప్రశ్న వేశారు. హరీష్ శంకర్ విషయాల గురించి స్పందిస్తూ...పౌర, మానవ హక్కుల సంఘాలపై కొన్ని ఘాటు వాఖ్యలు చేశారు. కాగాడాక్టర్లు, నర్సులు….. పోలీస్ లుపౌరులు, మానవులు కాదా..? ఇటీవల జరిగిన సంఘటనలపై పౌరహక్కుల సంఘాలు, మానవ హక్కుల సంఘాలు పత్తా లేరు…! సజ్జనార్ సార్ ను కడిగేయడానికి మాత్రం ….. తోసుకుంటూ ముందుకొస్తారు….” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: