చైనాలో పుట్టిన కోవిడ్-19 ప్ర‌పంచం మొత్తాన్ని అతలాకుతలం చేస్తోంది. ఈ మహమ్మారి వ‌ల్ల ఏర్ప‌డిన క్రైసిస్ అంతా ఇంతా కాదు. ఈ రక్కసి బారి నుండి ప్రాణాలను కాపాడుకోవడానికి లాక్‌డౌన్ ప్ర‌కటించిన తర్వాత ఎక్క‌డి వారు అక్క‌డే వుండిపోవాల్సిన పరిస్థితి. చాలా మందికి ఏం చేయాలో తెలియ‌క అయోమ‌య స్థితిలో అంద‌రూ ఉండిపోయారు. ముఖ్యంగా సినిమా రంగానికి చెందినవారు, మీడియా రంగానికి చెందినవారు చాలా ఇబ్బంది పడుతున్నారు. అయితే తాజాగా తెలుగు సినిమా 24 క్రాఫ్ట్‌ల‌కి CCC ద్వారా సినీ పెద్ద‌లు అండ‌గా నిలిచారు. కానీ 24 /7 ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా పని చేసే సినిమా జ‌ర్న‌లిస్ట్‌లకి మాత్రం ఈ ఇబ్బందులు తప్పడం లేదు. వీళ్లకు సహాయం చేయడానికి తెలుగు ఫిల్మ్‌జ‌ర్న‌లిస్ట్ అసోసియెష‌న్ ముందుకు వచ్చింది.

 

 

సినిమా క‌బుర్లను యావత్ ప్ర‌పంచంలోని అన్ని ప్రాంతాలకు చేరవేసే సినిమా జ‌ర్న‌లిస్ట్‌లకి తెలుగు ఫిల్మ్‌జ‌ర్న‌లిస్ట్ అసోసియెష‌న్ అండ‌గా ఉంటుందని వారు త‌మ భ‌రోసాను తెలియజేసారు. ఈ నేపథ్యంలో తెలుగు ఫిల్మ్‌జ‌ర్న‌లిస్ట్ అసోసియెష‌న్ ప్రెసిడెంట్ లక్ష్మినారాయ‌ణ మాట్లాడుతూ “ డైలీ ప్రెస్‌మీట్స్‌కి హ‌జ‌రయ్యే ప్ర‌తి ఓక్క జ‌ర్న‌లిస్ట్ ల‌కి, వీడియో మరియు ఫోటో జ‌ర్న‌లిస్ట్‌కి మేము ఆసరాగా ఉంటాము. ఈ భయంకర ప‌రిస్థితిని ఎదుర్కునే భాగంలో మేము 35 మంది తెలుగు సినిమా పాత్రికేయుల‌కి, నెల‌రోజుల‌కి స‌రిప‌డా నిత్యావ‌స‌రాల స‌రుకులను అందించాము. ఇలానే అంద‌రం క‌లిసి క‌ట్టుగా ఈ స‌మ‌స్య‌ని ఎదుర్కోవాల‌ని కొరుకుంటున్నాము. ఏ ఓక్క‌రూ ఆక‌లితొ ఉండకూడదు. మీకు ఏ ఇబ్బంది క‌లిగినా నాకు కాని, నాయిడు సురేంద్ర కుమార్‌కు గాని, tv5 రాంబాబుకి కాని ఫోన్ చేసి తెలియచేయండి. అన్ని స‌మ‌స్య‌లు పోయి మళ్ళీ అంద‌రం ఆనందంగా మ‌న ప‌నులు చేసుకొవాల‌ని ఆ భ‌గ‌వంతుడ్ని ఈ తెలుగు ఫిల్మ్‌జ‌ర్న‌లిస్ట్స్ అసోసియెష‌న్ ద్వారా నేను కొరుకుంటున్నాను” అని అన్నారు. ఈయన మాటల వల్ల చాలా మంది తెలుగు సినిమా జర్న‌లిస్ట్‌లకి ఊరట లభించింది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: