అదేంటి లాక్ డౌన్ తో ప్రజలు నానా తిప్పలు పడుతున్నారు.. పని లేని వాళ్ళు రోజు గడవక ఇబ్బందులు పడుతున్నారు. ఒకరోజు బయట పనికి వెళ్ళొస్తేనే ఆ రోజు ఇంట్లో కడుపునిండా భోజనం చేసే వారు కష్టాల్లో ఉన్నారు కదా అనుకోవచ్చు. ఇలాంటి వారి కోసమే ప్రభుత్వాలు, రాజకీయ నేతలు, సినీ సెలబ్రిటీస్ సహాయాన్ని అందిస్తున్నారు. ఇంట్లో కాలు మీద కాలేసుకుని కూర్చుని దేశాన్ని కాపాడే రోజు వచ్చింది. అందుకోసం ప్రజలంతా సాధ్యమైనంత వరకు ఇళ్లల్లోనే ఉంటూ కరోనా మీద యుద్ధం చేస్తున్నారు. అయితే మార్చి 22న జనతా కర్ఫ్యూ నుండి ఇప్పటివరకు ఇంట్లోనే ఉంటూ కాలం వెళ్లదీస్తున్నారు. 


24 గంటలు ఇంట్లోనే ఉంటే బోర్ కొట్టడం ఖాయం.. బయటకు వెళ్లి కరోనాని తగిలించుకుని జీవితాన్ని నాశనం చేసుకోవడం కన్నా ఇంట్లోనే ఉంటే మంచిదని కొందరు భావిస్తున్నారు. అయితే ఈ లాక్ డౌన్ వల్ల కొందరు పాట స్నేహితులను కలుసుకుంటున్నారు. అదేంటి లాక్ డౌన్ అంటే ఇళ్లలోంచి బయటకు రానివ్వడం లేదు అలాంటిది స్నేహితులు ఎలా కలుస్తారు అనుకోవచ్చు. ప్రస్తుతం టెక్నాలజీ పరంగా ఫుల్ అప్డేటెడ్ గా ఉన్న మా వాళ్ళు వీడియో కాల్స్ తో తమ దూరాన్ని దగ్గర చేసుకుంటున్నారు. 


వాట్సాప్ వీడియో కాల్ ఇప్పటికే ఉండగా కొత్తగా వచ్చిన గూగుల్ డుయో వీడియో కాల్ ఫెసిలిటీని వాడుకుంటున్నారు. గూగుల్ డుయోలో ఒకేసారి 10 మంది స్నేహితులతో వీడియో కాల్ మాట్లాడే అవకాశం ఉందని తెలుస్తుంది. అదే వాట్సాల్ప్ కాల్ లో మాత్రం ఒక్కరితోనే వీడియో కాల్ చేసే అవకాశం ఉంది. లాక్ డౌన్ లో దూరమైనా చిన్న నాటి స్నేహితులతో మాట్లాడుతూ చిన్ననాటి జ్ఞాపకాలను తలచుకుంటూ టైం పాస్ చేస్తున్నారు కొందరు. సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు ఎలాగూ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు. మిగతా కొందరు ఉద్యోగులు ఆన్ లైన్ లో తమ జాబ్ కొనసాగిస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: