అక్కినేని నాగ చైతన్య సమంత నటించిన సూపర్ హిట్ సినిమా మజిలీ. నిజ జీవితంలో భార్యా భర్తలైన నాగచైతన్య సమంత సినిమాలోను అలాగే నటిస్తున్నారనగానే సినిమా మీద అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈ సినిమాని తెరకెక్కించిన దర్శకుడు శివ నిర్వాణ అంతక ముందు నిన్ను కోరి వంటి డిఫ్రెంట్ లవ్ స్టోరీని తీసి హిట్ కొట్టి ఉండటంతో కూడా మజిలీ మీద పాజిటివ్ బజ్ నెలకొంది. అలాగే సినిమా ఫస్ట్ లుక్ నుండి టీజర్ ట్రైలర్ ఆ తర్వాత రిలీజ్ చేసిన సాంగ్ ప్రోమోస్ తో ఇంకా భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ముఖ్యంగా మిడిల్ క్లాస్ వాళ్ళ జీవితానికి దగ్గరగా కథ ని తయారు చేయడం అది తెరమీదకి తీసుకు రావడం అన్నది ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అయింది.

 

సినిమా రిలీజైన మొదటి రోజునుంచే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. లాంగ్ రన్ లో మంచి సినిమా.. ఫ్యామిలీ మొత్తం కలిసి చూసే సినిమా అన్న టాక్ తో బ్లాక్ బస్టర్ హిట్ ని సాధించింది. ఇక సినిమాకి పెద్ద ప్లస్ అంటే సమంత. తన ఎంట్రీతోనే సినిమా ఫీల్ మొత్తం మారిపోయింది. ఇక నాగ చైతన్య అప్పటి వరకు చేసిన సినిమాలన్ని ఒక ఎత్తైతే మజిలీ ఒక ఎత్తు అని చెప్పుకున్నారు. సినిమాలో ఇద్దరు పోటీ పడి నటించారు. పెళ్ళైయ్యాక కలిసి చేసిన మొదటి సినిమా కాబట్టి అందరి అంచనాలు బాగా అందుకున్నారు. ఇద్దరి కాంబినేషన్ లో ఈ సినిమా బ్లాక్ బస్టర్ ని సొంతం చేసుకుంది.

 

అయితే ఈ సినిమాలో నటించిన సెకండ్ హీరోయిన్ దివ్యాంశ కౌశిక్ కి టాలీవుడ్ మొదటి సినిమా మజిలీ. ఈ సినిమా మీద ఎన్నో ఆశలు పెట్టుకొని టాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. అందం అభినయం అన్ని ఉన్నాయి. కాని దివ్యాంశ కౌశిక్ కి లక్ కలిసి రాలేదు. మజిలీ సూపర్ హిట్ అయినా ఆ క్రెడిట్ మొత్తం నాగ చైతన్య సమంతల కే వెళ్ళిపోయింది. అసలు ఎక్కడ కూడా తన పేరు వినిపించలేదు. దాంతో ఈ సినిమా మీద ఎన్నో అంచానలు పెట్టుకున్న ఈ బ్యూటి కి టాలీవుడ్ షాకిచ్చింది. ప్రస్తుతం సినిమాలు లేక రక రకాల ఫొటో షూట్స్ చేసి మేకర్స్ ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఇక కరో ఎఫెక్ట్ తో అన్ని సినిమాలు ఆగిపోయాయి కాబట్టి ఇప్పుడప్పుడే ఈ అమ్మడిని పట్టించుకునే వాళ్ళు కష్టమే. 

మరింత సమాచారం తెలుసుకోండి: