టాలీవుడ్ లో కలెక్షన్ కింగ్ మోహన్ బాబుకు ప్రత్యేక స్థానం ఉంది. ఈయన నట వారసులుగా విష్ణు, మనోజ్, లక్ష్మీ ప్రసన్న సినిమాల్లో నటిస్తూ రాణిస్తున్నారు. అయితే.. ప్రస్తుత కరోనా వైరస్ కల్లోలం మంచు ఫ్యామిలీకి పెద్ద కష్టమే తెచ్చిపెట్టేట్టుంది. దాదాపు రెండేళ్లుగా సరైన సినిమాలు లేని మంచు హీరోలు వరుస సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. వీరిలో మంచు విష్ణు 2019లో వచ్చిన ఓటర్  తర్వాత సినిమా చేయలేదు. ప్రస్తుతం మొసగాళ్లు చిత్రీకరణలో ఉంది.

 

 

కన్నప్ప సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కించే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుత కరోనా దెబ్బకి ఇంత భారీ బడ్జెట్ అవసరమా అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఓ మోస్తరు బడ్జెట్ తో సినిమాలు తీస్తే వీరి సినిమా బిజినెస్ కు కలెక్షన్లకు సరిపోతుంది. కానీ బడ్జెట్ ఎక్కువ పెట్టడంతో గతంలో చాలా నష్టాలు చవిచూశారు. ప్రస్తుతం కన్నప్ప సినిమాను కూడా భారీగా తెరకెక్కించాలని భావిస్తున్నారు. వీరి మార్కెట్ స్థాయి దాటి ఖర్చు పెట్టే పరిస్థితులు ప్రస్తుతం లేవు. కరోనా పరిస్థితుల నుంచి గట్టెక్కిన తర్వాత సినిమాల పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పడం కష్టమే.

 

 

మనోజ్ కూడా దాదాపు రెండేళ్ల నుంచి సినిమాలు చేయట్లేదు. ప్రస్తుం అహం బ్రహ్మస్మి అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాకు దాదాపు 30 నుంచి 40 కోట్లు బడ్జెట్ పెట్టే యోచనతో సినిమా మొదలు పెట్టాడు. ఈమాత్రం బడ్జెట్ కూడా మనోజ్ కు భారీ మొత్తమే. ఈ పరిస్థితుల్లో ఇంత బడ్జెట్ అవసరమా అనే ప్రశ్నలు వస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్ లేని ఈ అన్నదమ్ములు భారీ బడ్జెట్ ల జోలికి వెళ్లకపోవడమే బెటర్ అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే మళ్లీ గాడిలో పడదామని మంచు హీరోలు చేస్తున్న ప్రయత్నాలు కరోనా దెబ్బకు ఏమేరకు ప్రతిఫలిస్తాయో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: