కరోనా వైరస్ దేశంలో వ్యాప్తి చెందకుండా నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 14 వరకు లాక్‌డౌన్‌ అమల్లో ఉంచిన విషయం అందరికీ తెలిసినదే. లాక్‌డౌన్‌ కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న థియేటర్లు మొత్తం క్లోజ్ అయిపోయాయి. దేశ ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావడంతో రవాణా తో పాటు షాపింగ్ మాల్స్ ఇంకా అనేక రంగాలు అంత క్లోజ్ అయిపోయాయి. ప్రధాని మోడీ కరోనా వైరస్ ని అరికట్టడం కోసం చాలా సీరియస్ గా వ్యవహరించడంతో దేశంలో ఉన్న అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పోలీసుల చేత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తూ ప్రజలు ఇంటి నుండి బయటకు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇటీవల ప్రధాని మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

 

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో లాక్‌డౌన్‌ ఏ విధంగా ఎత్తేయాలని సీఎంలతో చర్చించినట్లు సమాచారం. దశలవారీగా ఎత్తేయాలని ప్రధాని మోడీ ముఖ్యమంత్రులకు కొన్ని సూచనలు ఇచ్చారు అని వార్తలు వస్తున్నాయి. దశలవారీగా లాక్‌డౌన్‌ ఎత్తివేయడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి కూడా ముఖ్యమంత్రులకు ప్రధాని మోడీ సూచించినట్లు సమాచారం. వచ్చిన వార్తలను బట్టి దశల వారీగా అంటే అత్యంత ముఖ్యమైన వాటిని మొదట లాక్‌ డౌన్‌ నుండి తప్పిస్తారు.

 

ఆ క్రమంలో చూస్తే స్కూల్స్‌ ఇంకా థియేటర్లు చివర్లో ఓపెన్‌ చేసే అవకాశం ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దశలవారీగా అంటే ఏప్రిల్ చివరి వరకు లేదా మే రెండవ వారం వరకు మెల్లమెల్లగా కొన్ని కొన్ని రంగాలు ఓపెన్ అవుతాయి అని అంటున్నారు. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో రావడంతో చాలామంది నెటిజన్లు థియేటర్ లు ఓపెన్ చేస్తున్నారహో అని అంటున్నారు. అయితే అధికారికంగా మాత్రం ఇంకా ఎక్కడ బయటకు రాలేదు చాలా వరకు విశ్లేషకులు మొదటి దశలోనే సినిమా థియేటర్లు ఓపెన్ అయ్యే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: