తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శక ధీరుడు రాజమౌళి తర్వాత అంతటి సక్సస్ దక్కించుకున్న డైరెక్టర్ అంటే కొరటాల శివ. దర్శకుడిగా మారి ప్రభాస్ తో మిర్చి సినిమా తీసి బ్లాక్ బస్టర్ హిట్ ని సాధించాడూ. డైరెక్టర్ గా కొరటాల శివ తీసిన మొదటి సినిమానే ప్రభాస్ కి మంచి హిట్ ని ఇచ్చింది. ప్రభాస్ ని క్లాస్ గా చూపిస్తూనే మాస్ హిట్ ఇచ్చారు కొరటాల. ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు తో శ్రీమంతుడు, ఎన్.టి.ఆర్ తో జనతా గ్యారేజ్, మళ్ళీ మహేష్ బాబు తో భరత్ అనే నేను తీసి వరుస హిట్స్ ని సాధించారు. దీంతో కొరటాల శివ పేరు ఇండస్ట్రీలో మోగిపోయింది.

 

ఈ సక్సస్ ట్రాక్ చూసే మెగాస్టార్ చిరంజీవి తన సినిమా డైరెక్ట్ చేసే ఛాన్స్ ఇచ్చారు. అందుకే కొరటాల శివసినిమా కోసం ఇప్పటికే రెండేళ్ళు నిరీక్షించారు. ఈ రెండేళ్ళలో మళ్ళీ ఎన్.టి.ఆర్ తో ఒక సినిమా మహేష్ బాబు తో ఒక సినిమా చేయాలనుకున్న కొరటాలకి చిరు ఆఫర్ ఊహించనిది. అందుకే ఆ సినిమాల కంటే మెగాస్టార్ తో సినిమా చేయడానికి రెడీ అయిపోయారు. కాకపోతే కొన్నాళ్ళు సైరా తో చిరు కొరటాల శివ సినిమా డిలే అయింది. అయితే ఎట్టకేలకి సినిమా సెట్స్ మీదకి వచ్చింది. ఇందులో మరో స్టార్ హీరో మహేష్ బాబు కూడా నటిస్తున్నాడని మే మూడో వారం నుండి చిరంజీవి తో కలిసి ఫ్రేం లోకి వస్తారని ముందు నుంచి చిత్ర యూనిట్ ప్రచారం చేస్తున్నారు. 

 

అయితే కరోనా కారణంగా ఇప్పుడు ఆచార్య సినిమా కి కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం మహేష్ బాబు ఈ సినిమా నుండి తపుకునే అవకాశాలే  కనిపిస్తున్నాయట. మొన్నటి వరకు భారీ పాన్ ఇండియా సినిమాగా నిర్మించాలకున్న మాట వాస్తవం. అయితే ప్రస్తుతం కరోనా సృష్ఠించిన ఆర్ధిక సమస్యల నేపథ్యంలో బడ్జెట్ విషయం లో మేకర్స్ కొన్ని నిర్ణయాలను మార్చుకున్నారట. దీంతో ఆచార్య సినిమా విషయంలో కొరటాల శివ కి కొన్ని క్రియోటివ్ సమస్యలు వచ్చాయని అంటున్నారు.

 

ఇప్పటికే కథ కథనాల విషయంలో చాలాసార్లు మార్పులు చేశాడు. దేవదాయ ధర్మదాయ శాఖలో జరుగుతున్న అక్రమాల నేపథ్యం లో కథ సాగుతుందని బయటకి వార్త రాగానే కొందరు అభ్యంతరాలు తెలిపారు. దాంతో కథలో మళ్ళీ కొన్ని మార్పులు చేయాల్సి వచ్చింది. అలాగే మరో అగ్ర హీరో విషయంలో సమస్యలు పరిష్కారం అవడం లేదు. ఇప్పుడు బడ్జెట్ విషయం కొరటాల ని ఆలోచనలో పడేసిందట. బిజినెస్ పరంగా ఇప్పుడు అన్ని కొరటాల కే తగులుకున్నాయట.   

మరింత సమాచారం తెలుసుకోండి: