మ‌ల్లీశ్వ‌రి సినిమాలో డైలాగ్ లాగా హీరోయిన్‌తో  చెబుతాడు హీరో ఇక్క‌డి నుండి న‌డిస్తే అక్క‌డ వ‌ర‌కు ఉంటుంద‌ని హీరో వెంక‌టేష్‌. స‌గ‌టు మ‌నిషి జీవి ఆలోచ‌న‌లు అలా ఉంటాయి. ఈ ఆలోచ‌న‌లు వాళ్ళు ఎంత సంపాదించిన పోవు కొంద‌రికి. వాళ్ళ‌లో మ‌న స్టార్లు కూడా అతీతం కాదు కొంద‌రికి. లంకంత కొంప‌లో ఉండి రావ‌ణాశురుడు అహ‌మ‌యిపోయాడు. అలాగే ప‌ర్న‌శాల‌లో ఉన్న పూరి పాక‌లో ఉండి రాముడు దేవుడిలా మారాడు అన్న న‌మ్మ‌కాల‌ను మించి మ‌రొక‌టి లేదు. కాని మ‌న ఆరాధ్య దేవుళ్ళు మ‌న హీరోలు లంకంత కొంప‌ల‌ను వ‌దిలి డ‌బుల్‌, థ్రిబుల్ బెడ్‌రూమ్స్‌కి మారిన ఉదంతాలు బోలెడు. వీళ్ళ‌లో మ‌హేష్‌బాబు ముందు వ‌రుస‌లో ఉంటాడు. ఈ రాజ‌కుమారుడికి జూబ్లీ హిల్స్‌లో అతి పెద్ద రాజ‌భ‌వ‌నం ఉంది. ఇది కాద‌ని జ‌ర్న‌లిస్ట్ కాల‌నీలో త్రిపుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్స్‌కి చేంజ్ అయిపోయాడు. ఆ ఎదురు ఇంట్లోనే అక్క మంజుల కూడా ఉంటుంది. మ‌హేష్‌బాబుకి ఉండే ఆస్తిపాస్తుల‌కు ఈ ఇల్లు ఎంత మాత్రం సూట‌బుల్ కాదు. సుమారు ప‌దివేల కోట్ల ఆస్తిపాస్తులు మ‌హేష్‌బాబు సొంతం. కానీ చిన్న ఫ్లాట్‌లో అడ్జ‌స్ట్ అవుతున్నాడు. 

 

నాగ‌చైత‌న్య కూడా అంతే అన్న‌పూర్ణ  సామ్రాజ్యానికి అధినేత‌కు స్వ‌యానా కుమారుడు రామానాయుడు స్టూడియోస్‌కి సంబంధం ఉన్న‌వాడు. కావాలంటే ఇటు అక్కినేని, అటు ద‌గ్గుబాటి  కుటుంబాలు  రాజ‌భ‌వ‌నాల‌ను సృష్టించి ఇవ్వ‌గ‌ల‌రు. కానీ నాగ‌చైత‌న్య ఇన్ ఆర్ బిట్ మాల్ ద‌గ్గ‌ర సాదాసీదా ఇంట్లో ఉంటున్నాడు. ఇక త‌న రెండో సినిమా నుంచి ఇక్క‌డే మ‌కాం. పెళ్ళైనా స‌రే. కార‌ణం వాళ్ళ అమ్మల‌క్ష్మీ  ఈ ఇంటికి ఇంటీరియ‌ర్ డిజైన్ చేయించింది. కాబ‌ట్టి ఆ సెంటిమెంట్‌తోనే ఈ ఇల్లు వ‌దిలే ప్ర‌స‌క్తే లేదు అంటున్నాడు నాగార్జున న‌ట‌వార‌సుడు. ప‌వ‌న్‌క‌ళ్యాణ్ అయితే చాలా ఏళ్ళ‌పాటు నంద‌గిరి హిల్స్‌లో త్రిబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్స్‌లో ఉండేవాడు. కానీ ఆ త‌ర్వాత ఫామ్ హౌస్‌కి షిఫ్ట్ అయిపోయాడు. ఫామ్ హౌస్ అంటే నేల‌తో మంచి రిలేష‌న్ ఉంటుంది. రేణుదేశాయ్‌తో విడిపోయిన త‌ర్వాత ఈ ఇంటికి వ‌చ్చేశాడు ప‌వ‌న్‌. ప్ర‌స్తుతం రాజ‌కియాల కొద్ది అమ‌రావ‌తిలో కూడా ఒక ఇంటిని నిర్మించుకున్న విష‌యం తెలిసిందే. 

 

జ‌గ‌ప‌తిబాబుకి బంజారాహిల్స్‌లో వెయ్యిగ‌జాలా భారీ బంగ‌లా ఉంది. అయితే ఈ బంగ్లాను కాద‌నుకుని కూక‌ట్‌ప‌ల్లిలో లోతా ట‌వ‌ర్స్‌లో ఉంటున్నాడు. ఆలీ కూడా అంతే శ్రీ‌న‌గ‌ర్ కాల‌నీలో పెద్ద బంగ్లా ఉంటే అది కాద‌ని మ‌ణికొండ‌లోని త్రిబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్స్‌కి షిఫ్ట్ అయిపోయాడు. రాజ‌మౌళి ప‌రిస్థితి కూడా అంతే మొన్న‌టికి మొన్న త్రిపుల్ ఆర్ కోసం భారీ రెమ్యూన‌రేష‌న్ తీసుకున్నాడా అంత‌టి గెయినింగ్ కెపాసిటీ ఉన్న‌ప్ప‌టికీ త‌ను ఉండ‌టానికి అంత పెద్ద బంగ్ల అవ‌స‌రం లేద‌నంటున్నాడు ఈ ద‌ర్శ‌క ధీరుడు.  పెళ్ళైన ద‌గ్గ‌ర నుంచి అక్క‌డే ఉండేవాడు. మొద‌ట్లో ఒక విల్లాలో ఉండేవాడు రాజ‌మౌళి. రంగ‌స్థ‌లం లాంటి హిట్ ఇచ్చిన సుకుమార్ మ‌ణికొండ‌లో ఒక డ్రీమ్ హౌస్‌ని నిర్మించుకున్నాడు. అందులో జ‌నం ఎడాపెడా వ‌చ్చేవార‌ట‌. అయిఏత వారి తాకిడితట్టుకోలేక మ‌ణికొండ‌లో గేటెడ్ క‌మ్యూనిటీకి షిఫ్ట్ అయిపోయాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: