ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న ఒకే ఒక్క పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అని అందరికీ తెలిసిందే. బాహుబలి సినిమాకోసం దాదాపు నాలుగేళ్ళు కష్ట పడ్డ ప్రభాస్ కి రాజమౌళి ఈ రేంజ్ లో క్రేజ్ ని సంపాదించి పెట్టారు. బాహుబలి ప్రాంఛైజీ తో ప్రపంచ వ్యాప్తంగా ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. ఆ క్రేజ్ తో నే చిన్న బడ్జెట్ సినిమాలకి సైన్ చేయలేదు. బాహుబలి పార్ట్ 2 షూటింగ్ జరుగుతుండగానే యంగ్ డైరెక్టర్ సుజీత్ ఈ సినిమా కోసం రెడీ అయిపోయాడు. ప్రభాస్ ని హాలీవుడ్ స్టార్ గా చూపించడమే లక్ష్యం గా పెట్టుకున్నాడు. అందుకే బాహుబలి కన్‌క్లూజన్ రిలీజ్ రోజు నుండే సాహో టీజర్ ని రిలీజ్ చేసి సినిమా మీద, ప్రభాస్ మీద భారీగా అంచనాలు పెంచేశారు. 

 

బాహుబలి క్రేజ్ తోనే సాహో సినిమాని 350 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఇందులో ప్రభాస్ కి షేర్ కూడా ఉన్న విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా భారీగా అంచనాలు పెట్టుకున్న సాహో భారీగా నష్టాలను మిగిల్చింది. ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు కూడా సాహో తో 20 కోట్ల వరకు నష్ట పోయాడని ఇండస్ట్రీలో చెప్పుకున్నారు. లక్కీగా బాలీవుడ్ లో కాస్త కలెక్షన్స్ ని సాధించింది. కాని మిగతా అన్ని భాషల్లో ప్రభాస్ కి, యు వి బ్యానర్ కి నష్టాలు తప్పలేదు. దాంతో సాహో ఎకెఫ్ట్ ప్రభాస్ నెక్స్ట్ సినిమా మీద గట్టిగా పడింది.  

 

ఇక జిల్ ఫేం రాధాకృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ప్రభాస్ తాజా చిత్రానికి ఇప్పుడు ఎవరూ ఊహించని సమస్యలు చుట్టుకున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే ఈ సినిమా మొదలు పెట్టినప్పటి నుంచే ఏదో రకంగా అడ్డంకులు ఎదురవుతున్నాయి. సాహో తో వచ్చిన నష్టాలాను ఈ సినిమాతో సరి చేసుకుందామనుకున్న మేకర్స్ కి ఆ అవకాశం కనిపించడం లేదని ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికే బడ్జెట్ లో కోత పడింది.

 

ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ ఈ సినిమాకి మరో పెద్ద దెబ్బ అని అంటున్నారు. అందరికంటే ఎక్కువగా ప్రభాస్సినిమా విషయంలో సతమతమవుతున్నాడట. అంతేకాదు ఇప్పుడున్న పరిస్థితులని బట్టి చూస్తే నిర్మాత దిల్ రాజు తర్వాత మళ్ళీ అంతగా కరోనా ప్రభావం పడింది ప్రభాస్ మీదే అంటున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజముందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: