పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి టాలీవుడ్ లో ఉన్న ఇమేజ్ ఎలాంటిదో అందరీ తెలిసిందే. అత్తారింటికి దారేది సినిమాతో 100 కోట్ల క్లబ్ లోకి చేరిన ఆయన అజ్ఞాతవాసి తో భారీ డిజాస్టర్ ని చూశారు. అయితే ఆ తర్వాత సినిమా వదిలేసి రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు. అయితే పరిస్థితులు అనుకూలించక తిరిగి రీ ఎంటీ అంటూ మళ్ళీ సినిమాలలోకి వచ్చారు.  బాలీవుడ్ లో సూపర్ హిట్ సినిమా పింక్ తో దిల్ రాజు నిర్మిస్తున్న సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ 50 కోట్ల తో పాటు షేర్ అని కూడా సమాచారం. 

 

ఇక రీ ఎంట్రీ ఇస్తూనే వరుసగా సినిమాలని లైన్ లో పెట్టారు. ప్లాన్ బాగానే ఉంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో మళ్ళీ రెండేళ్ళ గ్యాప్ ని ఫుల్ ఫిల్ చేయాలనుకున్నారు. ఫ్యాన్స్ కి ఇలా వరుసగా సినిమాలు అనౌన్స్ చేస్తుంటే పట్టరాని సంతోషం లో మునిగిపోయారు. అయితే ఇప్పుడు ఈ స్టార్ హీరోకి కరోనా పెద్ద షాకిచ్చింది. అంతేకాదు ఈ హీరోని అన్ని రకాలుగా ఇబ్బందుల్లో పడేసిందని అంటున్నారు. కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ ప్రకటించడం.. థియేటర్లు మూత పడటంతో పాటు.. షూటింగులకు కూడా బ్రేక్ పడింది. 

 

అంతేకాదు ఈ హీరో నటిస్తున్న వకీల్ సాబ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా పెండింగ్ పడటం పవన్ కళ్యాణ్ టోటల్ షెడ్యూల్ నే మార్చేసింది. మిగతా సినిమాకి ఇచ్చిన డేట్స్ మొత్తం తారుమారు అయ్యాయి. అంతేకాదు ఆ సినిమా మేకర్స్ కూడా మళ్ళీ వెంటనే సినిమాలు మొదలు పెట్టే పరిస్థితులు కనిపిచడం లేదు. వకీల్ సాబ్ ఫినిష్ చేసి నెక్స్ట్ క్రిష్ సినిమా తర్వాత హరీష్ శంకర్ సినిమా, ఆ తర్వాత త్రివిక్రం లేదా పూరి జగన్నాధ్ ప్రాజెక్ట్ , ఆ తర్వాత డాలీ సినిమాలు కమిటయ్యారు. 

 

కాని ఇప్పుడు ఈ సినిమాలకి ఇచ్చిన డేట్స్ తో పాటు మిగతా వ్యూవహారాలన్ని చిక్కుల్లో పడ్డాయట, దీనికంటే పవన్ కళ్యాణ్ కి పెద్ద పెద్ద రెమ్యూనరేషన్. ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ కి ఓన్లీ రెమ్యూనరేషన్ అది కూడా 20 నుండి 30 కోట్లు మాత్రమే ఇవ్వగలని ప్రతిపాదన తెచారట. దీంతో ఇప్పటికే అడ్వాన్స్ తీసుకున్న ప్రాజెక్ట్స్ ని క్యాన్సిల్ చేసుకోలేక అటు ఒకే చెప్పలేక ఇరకాటం లో పడ్డారట.  

మరింత సమాచారం తెలుసుకోండి: