దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెలుగు చిత్ర పరిశ్రమ సత్తాను దేశమంతా చాటి చెప్పారు. ఒక్క బాహుబలి సినిమా రాజమౌళి ని ఆకాశం లో నిలబెట్టింది. ఎన్.టి.ఆర్ తో తీసిన మొదటి సినిమా 'స్టూడెంట్ నెం.1' నుండి ఇప్పటి వరకూ ఒక్క ఫ్లాప్ కూడా తన ఖాతాలో లేకపోవడం రాజమౌళి లో ఉన్న గొప్ప దర్శకుడికి నిదర్శనం. ప్రస్తుతం మన తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న ఒకే ఒక్క అగ్ర దర్శకుడు రాజమౌళి మాత్రమే.

 

రాఘవేంద్ర రావు శిష్యుడిగా 'స్టూడెంట్ నెం.1' సినిమా తో డైరెక్టర్ గా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చారు. మొదటి సినిమా తర్వాత నుండి రాజమౌళి సినిమా తీస్తున్నాడంటే అది ఏ హీరోతోనైనా కచ్చితంగా హిట్ అవ్వాల్సిందే అనే నమ్మకాన్ని ఇండస్ట్రీతో పాటు ప్రేక్షకుల్లో కలిగించారు. అసలు రాజమౌళి ఫ్లాపిస్తారని ఏ ఒక్కరు ఊహించరంటే అర్థం చేసుకోవచ్చు. 

 

ఎన్.టి.ఆర్, ప్రభాస్, రవితేజ, సునీల్, రాం చరణ్ .. ఇలా ఎవరితో తీసిన సినిమా బ్లాక్ బస్టర్ అవుతూనే కలెక్షన్స్ పరంగా రికార్డ్ క్రియోట్ చేయాల్సిందే. ఇక ప్రస్తుతం రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ అనే సినిమాను ఎన్టీఆర్, రాంచరణ్ ల తో పాన్ ఇండియా సినిమాగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. అయితే ఇంత భారీ చిత్రాలను తీస్తూ కూడా రిలీజ్ కు ముందు కూడా రాజమౌళి చాలా ప్రశాంతంగా కనిపిస్తుంటారు. ఆర్.ఆర్.ఆర్ సినిమాని 400 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. వాస్తవంగా ఈ జూన్ లేదా జూలై లో ఆర్.ఆర్.ఆర్ ని రిలీజ్ చేయాలనుకున్నారు చిత్ర యూనిట్. 

 

కాని ఇతర ఇతర కారణాలతో వచ్చే ఏడాది జనవరి 8 న విడుదల చేస్తామని అఫీషియల్ గా రాజమౌళి అనౌన్స్ చేశారు. అయితే ఇప్పుడు ఈ సినిమా బిజినెస్ పరంగా టాక్ నడుస్తోంది. 400 కోట్ల బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ సినిమా 800 కోట్ల వసూళ్ళని సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే ఇది చాలా తక్కువ అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే బాహుబలి కి అయిన బిజినెస్ ని దృష్ఠిలో పెట్టుకొని ఆర్.ఆర్.ఆర్ వసూళ్ళని అంచనా వేశారు. కాని ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులని బేరీజు వేసుకొని చూస్తే 800 కోట్ల కంటే ఎక్కువ చేయకపోవచ్చు అన్న మాట వినిపిస్తుంది. మరి ఈ అంచనాలు తారుమారు అవుతాయోమో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: