'రౌద్రం రణం రుధిరం' ప్రస్తుతం మన టాలీవుడ్ తో పాటు మిగతా సినిమా ఇండస్ట్రీలో వాళ్ళు .. ఎంతో ఆసక్తిగా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మొన్నటి వరకు ఒక రేంజ్ వరకే ఊహించినప్పటికి జక్కన్న ఎప్పుడైతే రాం చరణ్, తారక్ ల ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారో అప్పటి నుంచి ప్రేక్షకులను విపరీతంగా అంచనాలు పెరిగిపోయాయి. ఇక చరణ్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్ అందులో తారక్ వాయిస్లో ఉన్న పవర్ ఫుల్ డైలాగ్స్ సినిమా రేంజ్ ఏంటో చూపించాయి. అంతేకాదు ప్రేక్షకులందరు 2021 ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నారు.

 

ఇక ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పటి నుంచి జక్కన్న నెమ్మదిగా పబ్లిసిటీ ని పీక్స్ కి తీసుకువెళుతున్నారు. ఇక తన సినిమాను పబ్లిసిటీ చేసుకోవడంలో రాజమౌళి లాంటి దర్శకుడు టాలీవుడ్ లో ఇంకొకరు ఉండరు. కరోనాని కూడా లెక్క చేయకుండా రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా 'భీమ్ ఫర్ రామరాజు' అనే పేరుతో ఎన్టీఆర్ ఒక స్పెషల్ వీడియో విడుదల చేసి ఏ రేంజ్ లో హంగా చేశారో అందరికీ తెలిసిందే. ఈ వీడియోతో రామ్ చరణ్ ఎలా ఉండబోతున్నాడో రాజమౌళి చూపించిన సాంపిల్ అదిరిపోయింది. దాంతో ఇప్పుడు ఎన్టీఆర్ పాత్ర ఎలా ఉండబోతుందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు యావత్ ప్రేక్షకులకి క్యూరియాసిటి పెరిగిపోయింది. ఇప్పుడు ఎన్టీఆర్ వీడియోకి సంబంధించి ఒక లాటెస్ట్ అప్‌డేట్ తాజాగా బయటికి వచ్చింది. 

 

ఎన్టీఆర్ పుట్టినరోజు ఈ సందర్భంగా ఎన్టీఆర్ కి బర్త్ డే గిఫ్టుగా రామ్ చరణ్ కూడా 'రామరాజు ఫర్ భీమ్' అన్న ఒక స్పెషల్ వీడియో రెడీ చేపిస్తున్నాడట. ఇది చూసిన ప్రతీ ఒక్కరు 'రౌద్రం రణం రుధిరం' లో తారక్ తారా స్థాయిలో కనిపిస్తాడని ఫీలవుతారని సమాచారం. ఇక ఈ వీడిలో కొన్ని పవర్ ఫుల్ డైలాగ్స్ తో పాటు సీన్స్ ని రివీల్ చేయనున్నారట. ఇక  డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకి కీరవాణి సంగీతాన్ని అందిస్తుండగా బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగన్ అలియా భట్ నటిస్తున్న సంగతి తెలిసిందే. 20121 జనవరి 8 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.     

మరింత సమాచారం తెలుసుకోండి: