దశాబ్దాల చరిత్రని కలిగియున్న సినీ ఇండస్ట్రీ ఇప్పుడు కంటికి కనిపించని ఒక చిన్న సూక్ష్మజీవి వల్ల విలవిల్లాడిపోతున్నది. కరోనా మహమ్మారి సృష్టించిన అలజడి వలన సినీ పరిశ్రమ కొన్ని వేల కోట్ల మేర నష్టాలు చవిచూసే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. కరోనా మహమ్మారి ఎఫెక్ట్ వల్ల దేశ వ్యాప్తంగా మల్టీ ఫ్లెక్సులు థియేటర్స్ మూసివేసిన సంగతి తెలిసిందే. కరోనా కొట్టిన దెబ్బకి టాలీవుడ్ ఇప్పట్లో కోలుకొనే పరిస్థితులు కనిపించడం లేదు. హుద్ హుద్ లైలా తుపాన్ లాంటి ప్రకృతి విపత్తులను కూడా ధైర్యంగా ఎదుర్కొన్న టాలీవుడ్ కరోనా వైరస్ కి భయపడిపోయింది.  సినిమా రంగంలో పనిచేసే 24 క్రాఫ్ట్స్ మూతపడిన సందర్భం ఇదే.

 

కరోనా వల్ల సినీ ఇండస్ట్రీ మీద ఆధారపడి జీవిస్తున్న కొన్ని లక్షల మంది కార్మికుల జీవితాలలో కరోనా కలకలం రేపింది. ఒక సినిమా స్టార్ట్ అయినప్పటి నుండి జనాల్లోకి తీసుకెళ్లే దాకా పీఆర్వోలు ముఖ్య పాత్ర పోషిస్తుంటారు. ఎంత పెద్ద సినిమా అయినా వీళ్ల ద్వారా జనాలకి రీచ్ అవ్వాల్సిందే. అయితే దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించడంతో సినీ ఇండస్ట్రీ కూడా లాక్ డౌన్ అయింది. ఈ నేపథ్యంలో పీఆర్వోలకు పనే లేకుండా పోయింది. ఎప్పుడూ చేతి నిండా పనితో కళకళలాడుతూ ఉండే వీళ్ల జీవితాలు ఇప్పుడు వెలవెల పోతున్నాయి. కానీ కొంతమంది హీరోయిన్ల వల్ల కొందరు పీఆర్వోలు అంతో ఇంతో నెట్టుకొస్తున్నారు.

 

వివరాల్లోకి వెళ్తే కొంతమంది ఫేడ్ ఔట్ దశకు వచ్చిన హీరోయిన్లు వాళ్ళను బాగా పాపులర్ చేసిన కొన్ని ఫోటోలను పీఆర్వోలకు ఇచ్చి ప్రమోట్ చేసుకుంటున్నారట. ఏదేమైనా కరోనా మూలంగా పీఆర్వోల జీవితాలు దయనీయంగా తయారయ్యాయని చెప్పవచ్చు. కరోనా మహమ్మారిని ప్రాలదోలడానికి టాలీవుడ్ మొత్తం ఏకతాటిపై వచ్చింది. కరోనా బాధితులను ఆదుకోడానికి టాలీవుడ్ మొత్తం కదలి వచ్చింది. తమకు తోచిన రీతిలో సహాయం చేస్తున్నారు. శతాబ్దానికి ఒకసారి వచ్చే ఇలాంటి వైరస్ బారి నుండి త్వరగా బయటపడి సినీ పరిశ్రమ పూర్వ వైభవాన్ని పొందాలని సినీ అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: