ప్రస్తుతం కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆచార్య సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత కొరటాల శివ ఎన్టీఆర్ డైరక్షన్ లో సినిమా చేస్తాడని తెలుస్తుంది. ఆల్రెడీ ఎన్టీఆర్ తో తారక్ జనతా గ్యారేజ్ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఈ కాంబినేషన్ లో సినిమా అనగానే అంచనాలు పెరిగాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ త్రివిక్రమ్ డైరక్షన్ లో సినిమాకు సిద్ధమవుతున్నాడు. అయినను పోయి రావాలె టైటిల్ తో ఈ సినిమా వస్తుందని తెలుస్తుంది. 

 

చిరు సినిమా తర్వాత తారక్ తో సినిమా కోసం ఒక లైన్ సిద్ధం చేశాడట కొరటాల శివ. స్టార్ హీరోలతో కమర్షియల్ సినిమాల్లో కంటెంట్ ఉన్న సినిమా చేయడంలో కొరటాల శివ సక్సెస్ అవుతున్నాడు. జనతా గ్యారేజ్ తర్వాత కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబో సినిమా అనగానే సూపర్ క్రేజ్ ఏర్పడింది. ఇక జనతా గ్యారేజ్ సినిమాలో చాలా సెటిల్డ్ గా పెర్ఫార్మ్ చేసి సూపర్ సక్సెస్ అందుకున్నాడు తారక్. ఇప్పుడు మరోసారి అలాంటి క్రేజీ స్టోరీతో కొరటాల శివ తారక్ సినిమా ఉంటుందని తెలుస్తుంది. 

 

త్రివిక్రమ్ డైరక్షన్ లో సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని తెలుస్తుంది. ఆ సినిమా తర్వాత ఏమాత్రం గ్యాప్ లేకుండా కొరటాల శివ సినిమా చేస్తున్నాడు. ఈ కాంబినేషన్ లో సినిమా అనగానే ఇండస్ట్రీలో కూడా అంచనాలు పెరిగాయి. కచ్చితంగా మరో సంచలనంగా సినిమా వస్తుందని తెలుస్తుంది. ఆర్.ఆర్.ఆర్ తర్వాత వెంటనే త్రివిక్రం సినిమా.. ఆ తర్వాత కొరటాల శివ సినిమా వరుస క్రేజీ సినిమాలతో దుమ్ముదులిపేస్తున్నాడు తారక్. కాంబినేషన్ అదిరింది మరి సినిమా ఎలాంటి రికార్డులు సృస్తిస్తుందో చూడాలి. ట్రిపుల్ ఆర్ సినిమాలో తారక్ కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్నాడని తెలిసిందే 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: