రాజమౌళి తెరకెక్కిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ఆర్.ఆర్.ఆర్ నుండి మోషన్ పోస్టర్ తో పాటు రామ్ చరణ్ ఫస్ట్ లుక్ కూడా వచ్చేసింది. మోషన్ పోస్టర్ తో ఆశలు రేపిన ఆర్.ఆర్.ఆర్ టీమ్ రామ్ చరణ్ ఫస్ట్ లుక్ తో అంచనాఅలని పెంచేసింది. అయితే మొన్నటి వరకు షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం కరోనా కారణంగా క్యాన్సిల్ చేసుకుని కొన్ని రోజుల పాటు వాయిదా వేసుకుంది. చిత్రీకరణ్ వాయిఆ పడటంతో ఆర్.ఆర్.ఆర్ లో రామ్ చరణ్ సరసన నటించే ఆలియాభట్ సినిమా నుండి తప్పుకుందని వార్తలు వచ్చాయి.

 

కానీ మోషన్ పోస్ట్ర్ రిలీజ్ తో ఆ పుకార్లకి ఫుల్ స్టాప్ పడింది. కరోనా సమయాన్ని పోస్ట్ ప్రొడక్షన్ కోసం వినియోగిస్తున్న ఆర్.ఆర్.ఆర్ టీమ్ లాక్ డౌన్ ముగిసిన వెంటనే పుణెకి వెళ్లనున్నారట. అయితే ఇప్పటి వరకు ఎనభై శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్ర చిత్రీకరణలోహీరొయిన్లు పాల్గొనలేదు. ఎన్టీఆర్ సరసన బ్రిటన్ భామఒలివియా మోరిస్ కనిపించనుండగా, రామ్ చరణ్ స్పక్కన బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ నటించనుంది.

 

అయితే వీరిద్దరూ సినిమా చిత్రీకరణలో పాల్గొనే టైమ్ వచ్చేసిందట. లాక్ డౌన్ ముగియగానే ఆలియా షూటింగ్ లో పాల్గొంటుందట. మొట్ట మొదటగా ఆళియాపై పాటని షూట్ చేయనున్నారట.పాటతోనే ఆమె ఆర్.ఆర్.ఆర్ చిత్రీకరణ మొదలవుతుందట. రామ్ చరణ్ కి జోడీగా చేస్తున్న ఆలియా పాత్ర పేరు సీత అని సమాచారం. అయితే పాట అని తెలియగానే అందరి దృష్టి అల్లూరి సీతారామరాజులోని వస్తాడు నా రాజు అనే పాట మీదే పడింది.

 


మరి ఇది కూడా అలాంటి సందర్భంలో వచ్చే పాటనేనా లేక రామ్ చరణ్ ఆలియా మధ్య వచ్చే డ్యూయట్ సాంగా అనేది తెలియదు.

మరింత సమాచారం తెలుసుకోండి: