కరోనా ఎఫెక్ట్ సినీ రంగం మీద చాలా ప్రభావం చూపిస్తోంది. షూటింగ్ లు ఆగిపోవటంతో కార్మికుల పరిస్థితి దయనీయంగా తయారైంది. వారిని ఆదుకునేందుకు సినీ పెద్దలు సాయం చేస్తున్నారు. అయితే అక్కడి వరకు భాగానే ఉంది. కానీ ఇప్పటికే షూటింగ్ పూర్తయి రిలీజ్‌కు రెడీగా ఉన్న సినిమాల పరిస్థితి ఏంటి అన్న ప్రశ్న ఉత్పనమవుతుంది. పెద్ద సినిమాల విషయంలో ఇలా ఆగిపోవటం వల్ల నష్టం పెద్దగా ఉండకపోవచ్చు. కానీ చిన్న సినిమాల విషయంలో మాత్రం పరిస్థితి దారుణంగా ఉంది.

 

పరిస్థితులు సరిగ్గా ఉన్న సమయంలో కూడా చిన్న సినిమాల పరిస్థితి ఇబ్బంది కరంగానే ఉండేది. ఆ సినిమాలక థియేటర్లు సరైన స్థాయిలో దొరక్క నిర్మాతలు అప్పులపాలైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఇప్పుడు పరిస్థితులు మరింత అద్వానంగా తయారయ్యాయి. అప్పులు చేసి సినిమా లు నిర్మించిన నిర్మాతలకు ఇప్పుడు వడ్డీలు కట్టడం మరింత భారంగా మారింది. వచ్చినకాడికి వసూళు చేసుకుందామన్నా థియేటర్లు ఇప్పట్లో తెరుచుకునే పరిస్థితి లేదు.

 

దీంతో ఆ నిర్మాతలు కొత్త ఆలోచన చేస్తున్నారట. ఎలాగూ థియేటర్‌ రిలీజ్ కారణంగా పెద్దగా ఉపయోగ్ ఉండదు కాబట్టి, నేరుగా డిజిటల్‌ రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారట. సినిమా మరింత ఆలస్యం చేయకుండా ఎంతో కొంతకు డిజిటల్‌ ప్లాట్‌ ఫామ్స్‌క సినిమాను అమ్మేస్తే వచ్చిన కాడికి సరిపెట్టుకోవచ్చిన భావిస్తున్నారట. అయితే ఈ విషయంపై నిర్ణయం తీసుకోకపోయినా ఇదే సరైన దారి అని అభిప్రాయ పడుతున్నారట చిత్ర నిర్మాతలు.

 

పెద్ద సినిమాల విషయంలో పరిస్థితి మరోలా ఉంది. ఇప్పటికే కొన్ని సినిమాలకు రిలీజ్ డేట్ లు ఇచ్చేశారు. ప్రస్తుతం ఆ సినిమాలన్నీ వాయిదా పడుతున్నాయి. లాక్ డౌన్‌ ఎత్తి వేసినా థియేటర్లు మాత్రం ఇప్పట్లో తెరిచి పరిస్థితైతే కనిపించటం లేదు. అంటే ఆ సినిమాలు ఇంకా ఎన్నిరోజుల వాయిదా వేయాలి. షూటింగ్ లు ఎప్పుడు ప్రారంభమవుతాయో అర్థం కావటం లేదు. దీంతో నిర్మాతలు తలలు పట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: