అల్లు అర్జున్.. లేట్ గా అయినా లేటెస్ట్ గా అలవైకుంఠపురంలో సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్  కొట్టాడు. సంవత్సరంన్నర వెయిట్ చేసిన తరవాత ఇన్నాళ్లకు సూపర్ సక్సెస్ కొట్టిన ఈ హీరో కి ఇప్పుడు ఫుల్ డిమాండ్ ఉంది. అందుకే డిమాండ్ ని బట్టి రేట్ కూడా  అదే లెవల్లో పెంచేశాడు ఈ మెగా హీరో.

 

సూపర్ సక్సెస్ కోసం వెయిట్  చేసిన  అల్లు అర్జున్ కి అలవైకుంఠపురంలో  సినిమాతో అంతకుమించిన బ్లాక్ బస్టర్ అందింది .  నా పేరు సూర్య ఇచ్చిన అట్టర్ ఫ్లాప్ దెబ్బతో .. హిట్ కోసం బాగా వెయిట్ చేశాడు బన్నీ. త్రివిక్రమ్ డైరెక్షన్లో పూజాహెగ్డే జంటగా  వచ్చిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ .. అన్ని రికార్డుల్ని బద్దలు కొట్టి అద్దిరిపోయే కలెక్షన్లతో అంతకుమించి సూపర్ హిట్ టాక్ తో బ్రహ్మాండమైన సక్సెస్ ఇచ్చింది బన్నీకి.

 

అలవైకుంఠపురం ఇచ్చిన  అదిరిపోయే సక్సెస్ తో బన్నీకి డిమాండ్ పెరిగిపోయింది. డిమాండ్ కి తగినట్టు రేట్ కూడా అమాంతం పెంచేశాడు బన్నీ.  అబ్బాయి గారు ఇప్పుడు తీసుకుంటున్న 15 కోట్లకు డబుల్ చేసేసి దాదాపు 30 కోట్లు డిమాండ్ చేస్తున్నాడట బన్నీ. మరి సక్సెస్ లో ఉన్న హీరోతో సినిమా అంటే అంతే ఉంటుందని అంటున్నారట బన్నీ క్లోజ్ సర్కిల్స్ .

 

బన్నీ ప్రస్తుతం సుకుమార్ తో సినిమా చేస్తున్నాడు . స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈసినిమాలో బన్నీ డిఫరెంట్ డిఫరెంట్ లుక్స్ లో వేరియేషన్స్ లో కనిపించబోతున్నాడు . రష్మిక మంథన హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు బన్నీ .. ఈ రేంజ్ లో రెమ్యూనరేషన్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నాడట. నిన్న కాక మొన్నొచ్చిన యంగ్ హీరోలే 10 కోట్లకు పైగా డిమాండ్ చేస్తుంటే ..మెగా హీరో, అందులో మాంచి ఫామ్ లో ఉన్న హీరో  ఆమాత్రం డిమాండ్ చెయ్యకుండా  ఉంటాడా అంటున్నారట .

మరింత సమాచారం తెలుసుకోండి: