ప్రజెంట్ బాలీవుడ్ లో హ్యాపెనింగ్ హీరోయిన్ కియారా అద్వానీ. ఈ అమ్మడికి సినిమాల నుంచి  వచ్చే చెక్కులతో పాటు.. చక్కర్లు కొట్టడానికి కార్లు కూడా ఎక్కువైపోతున్నాయి ఇంట్లో. బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ తో  మంచి ఫామ్ లో ఉన్న కియారా.. వెబ్ సిరీస్ ల్లో కూడా నటిస్తూ ఒక చేత్తో డబ్బులు సంపాదిస్తూ..మరో చేత్తో  వరుస పెట్టి కార్లు కొనేస్తోంది.

 

కియారా అద్వానీ… క్రేజీ ఆఫర్లతో కెరీర్ లో బిజీ అయిపోతోంది. ఇప్పటికే చేతినిండా సినిమాలతో డేట్స్ లేవని చెబుతోంది ఈ భామ.  బాలీవుడ్ లో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ తో మినిమం 100కోట్ల హీరోయిన్ గా పేరుతెచ్చుకుంది కియారా. సినిమాల తోనే కాదు ..ఇప్పుడు వెబ్ సిరీస్ లతో కూడా వరుస హిట్స్ కొట్టేస్తోంది ఈ కబీర్ సింగ్ భామ.

 

మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిన కియారా ..అటుసినిమాలు ..ఇటు వెబ్ సిరీస్ లు అంటూ రెండు చేతులతో సంపాదిస్తోంది. సంపాదించింది..ఎంతని సేవ్ చేస్తాం..అందుకే వరుస పెట్టి కార్లు కొనేసతోంది.మొన్న మొన్నటి వరకూ  పెద్దగా తన లావిష్ లైఫ్ స్టైల్ ని ఎక్స్ పోజ్ చెయ్యని ఈ భామ ఇప్పుడు ఏకంగా 60 లక్షలతో  ఇ-క్లాస్  220 డి వైట్ స్పార్క్లింగ్  బెంజ్ కారు కొనేసింది. సూపర్ కంఫర్టబుల్ గా ఉన్న ఈ కార్ లోనే ఇప్పుడు షికారు కెళుతోంది కియారా.

 

ఆల్రెడీ అంతకుముందున్న  బిఎమ్ డబ్ల్యు 5 సిరీస్ లోని వైట్ కార్ ను ఇప్పుడు పక్కన పెట్టేసింది. మొన్న మద్య వరకూ సినిమా ప్రమోషన్లకు పార్టీలకు ఈ కార్ నే వాడిన కియారా ఇప్పుడు  బెంజ్ లో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం గిల్టీ వెబ్ సిరీస్ తో సూపర్ హిట్ కొట్టిన  ఈ భామ ఇప్పుడు  అక్షయ్ కుమార్ తో లక్ష్మీబాంబ్  సినిమాతో పాటు .. కరణ్ జోహార్ తో మరో రెండు సినిమాలతో బిజీగా ఉంది. అందుకే మరి వరుసహిట్లతో  బాలీవుడ్ లో ప్రస్తుతం కియారా టైమ్ నడుస్తోందంటున్నారు ఫ్యాన్స్ .

మరింత సమాచారం తెలుసుకోండి: