ఎవరైనా.. రాత్రి పగలు , ఎండ వాన , ఏవీ పట్టించుకోకుండా కష్టపడి సంపాదించేది ఎవరి కోసం..? పిల్లల కోసం పిల్లల బంగారు భవిష్యత్తు కోసం. మనం ఉన్నా లేకపోయినా వాళ్లకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉ:డడం కోసమే ఇదంతా చేస్తారు అందరూ. కానీ జేమ్స్ బాండ్ మాత్రం .. తనకున్న వెయ్యి కోట్ల ఆస్తిని అస్సలు పిల్లలకి ఇచ్చే ప్రసక్తే లేదంటున్నాడు.ఎందుకో ఏంటో చూద్దాం.

 

జేమ్స్ బాండ్ సిరీస్ లో హీరోలుగా వచ్చిన అందరి కన్నా ఎక్కువ ఫేమ్, నేమ్,క్రేజ్ సంపాదించుకున్నది డేనియల్ క్రెయిగ్ . మోడర్న్ బాండ్ గా జేమ్స్ బాండ్ కి ఉ:డే  స్టేచర్ ని ఇంకాస్త ఎలివేట్ చేసి అందరినీ ఆకట్టుకున్నాడు క్రెయిగ్ . షార్ప్ లుక్స్ , ఇంటెన్స్ ఎక్స్ ప్రెషన్స్ విత్ బ్లూ ఐస్ తో ఉండే ఈ జేమ్స్ బాండ్ .. బాండ్ లందరిలోకి మోస్ట్ సెక్సీయస్ట్ బాండ్ అని పేరు సంపాదించుకున్నాడు.

 

డేనియల్ క్రెయిగ్ ప్రస్తుతం నో టైమ్ టూ డై అనే బాండ్ సిరీస్ లో లాస్ట్ మూవీ చేస్తున్నాడు . బాండ్ సినిమాలకు సంబందించి  వచ్చిన ఫేమ్ తో పాటు హ్యూజ్ రెమ్యూనరేషన్ కూడా తీసుకుంటున్నాడు క్రెయిగ్. ఈ హీరోకి ప్రస్తుతానికి ఉన్న ఆస్తి ..దాదాపు వెయ్యికోట్లు . ఈ వెయ్యి కోట్ల సంపాదనను తన పిల్లలకు ఏమాత్రం ఇవ్వనంటున్నాడు ఈ జేమ్స్ బాండ్.

 

అందరూ తాము ఉన్నా లేకపోయినా .. నెక్ట్ జనరేషన్ కు చెందాలని ఎంతగా ఆశపడి కష్టపడతారో.. డేనియల్ మాత్రం తను చనిపోయిన తర్వాత ఆస్తిని తన  ఇద్దరు పిల్లలకు మాత్రం ఇవ్వనంటున్నాడు . ఒకరు చనిపోయిన తర్వాత వచ్చే డబ్బు అంత మంచిది కాదని .. అందుకే బతికుండగానే ఎవరో ఒకరికి ఇచ్చెయ్యాలంటున్నాడు డేనియల్ క్రెయిగ్ .  మరి ఈ జేమ్స్ బాండ్ థియరీ వెనుక ఏ లాజిక్ ఉందో అని ఆలోచిస్తున్నారు ఫ్యాన్స్ అందరూ.

మరింత సమాచారం తెలుసుకోండి: