బన్నీ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఇంకా టైటిల్ ఖరారు కాని సినిమాపై అభిమానుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. అల వైకుంఠపురములో వంటి బ్లాక్ బస్టర్ తర్వాత బన్నీ చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు మరింత పెరిగాయి అటు సుకుమార్ కూడా రంగస్థలం బ్లాక్ బస్టర్ తర్వాత చేస్తున్న చిత్రం కావడంతో.. వీరిద్దరి కాంబినేషన్లో రూపొందుతున్న ఈ రివేంజ్ డ్రామాపై బాగా ఆసక్తి నెలకొంది.

 

 

ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో జరిగే ఇ కథ ఎక్కువ భాగం చిత్తూరు ప్రాంత పరిధిలోనే జరుగుతుందట. అందుకోసం సినిమాలో నటించేవారిని చిత్తూరు ప్రాంతం వారినే తీసుకున్నాడట సుకుమార్. ఈ సినిమా కోసం బన్నీ కుడా చిత్తూరు యాసని నేర్చుకున్నాడట. నాన్నకు ప్రేమతో, రంగస్థలం సినిమాలాగా ఇది కూడా రివేంజ్ డ్రామాతో తెరకెక్కుతుండడంతో జనాల్లో బాగా ఆసక్తి ఉంది.

 

 

లారి డ్రైవర్ గా కనిపించనున్న బన్నీ లుక్ ఈ సినిమాలో అదిరిపోనుందట. గుబురు గడ్డం, మెడలో తాయెత్తు మాసిపోయిన బట్టల్తో కంప్లీట్ డిఫెరెంట్ గా కనిపించనున్నాడట. రంగస్థలంలో రామ్ చరణ్ కనిపించిన దానికంటే ఇంకా డీ గ్లామర్ లుక్ లో బన్నీ మెరుస్తాడట. తమిళ సినిమల్లో ఉండే హీరోల్లాగా ఈ సినిమాలో బన్నీ లుక్ ఉంటుందట. సుకుమార్ సినిమాలో హీరో ఎంత స్టైలిష్ గా కనిపిస్తాడో అందరికీ తెలిసిందే.

 

 

ఆయన మొదటి సినిమా నుండి చూసుకుంటే హీరోలని చాలా బాగా చూపిస్తాడు. ఆ విధంగానే ఈ సినిమాలోనూ కంప్లీట్ డిఫరెంట్ లుక్ తో చూడగానే ఆసక్తి రేపేలా ఉంటుందట. ఏప్రిల్ ౮వ తేదీ బన్నీ పుట్టినరోజు సందర్భంగ ఈ చిత్ర ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేస్తారని ప్రచారం జరుగుతుంది. లాక్ డౌన్ ఉన్న నేపథ్యంలో ఈ ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తే బాగుంటుందని అంటున్నారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: