‘ఆర్ ఆర్ ఆర్’ మూవీని రాజమౌళి ఏ క్షణంలో మొదలుపెట్టాడో తెలియదుకాని ఆ మూవీ మొదలుపెట్టిన దగ్గర నుంచి అన్నీ విఘ్నాలే. అయితే పట్టుదలకు చిరునామాగా కనిపించే రాజమౌళి ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఈమూవీని ఇప్పటి వరకు 70 శాతం షూటింగ్ పూర్తి చేసినట్లు వార్తలు వస్తున్నాయి. 


అయితే ఇప్పుడు కరోనా దెబ్బ ‘ఆర్ ఆర్ ఆర్’ కు మరొక విధంగా తగిలినట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈమూవీ నైజాం హక్కుల కోసం దిల్ రాజ్ 75 కోట్ల ఆఫర్ ఇవ్వడం దానికి సంబంధించి 15 కోట్లు అడ్వాన్స్ గా ఇవ్వడం జరిగింది అంటూ చాలకాలం క్రితమే వార్తలు వచ్చాయి. 


వాస్తవానికి ఈ సినిమాకు సంబంధించి రాజమౌళి చరణ్ జూనియర్ ల మ్యానియాతో పాటు ఈ చిత్రానికి సంక్రాంతి అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి రిస్క్ ఉండదని దిల్ రాజ్ ఇంత భారీ మొత్తంలో ‘ఆర్ ఆర్ ఆర్’ ఆఫర్ ఇచ్చాడు అన్న అభిప్రాయాలు అప్పట్లో వినిపించాయి. అయితే ఇప్పుడు కరోనా తో మన తెలుగురాష్ట్రాలలో పరిస్థితి అయోమయంగా మారిపోయి ఆర్ధిక పరిస్థితి పూర్తిగా దెబ్బ తింటుంది అన్న ఊహాగానాలు వస్తున్న నేపధ్యంలో కరోనా వైరస్ ప్రభావం మన దేశ ఆర్ధిక పరిస్థితుల పై కనీసం ఒక సంవత్సరం ప్రభావం చూపెడుతుంది అన్న అంచనాలతో సినిమాల బిజినెస్ కూడ ఏమంత బాగుండదని దిల్ రాజ్ ఒక స్పష్టమైన అంచనాకు ఇప్పటికే వచ్చినట్లు టాక్. దీనితో దిల్ రాజు ‘ఆర్ ఆర్ ఆర్’ ఒప్పందంపై తిరిగి నిర్మాతలతో చర్చలు జరపాలని అనుకుంటున్నారట. 


ఒకవేళ ‘ఆర్ ఆర్ ఆర్’ నిర్మాత చర్చలకు అంగీకరించకపోతే దిల్ రాజు ఈ ఒప్పందం నుండి తప్పుకునే అవకాశం ఉందని ఇండస్ట్రీలో గాసిప్పులు గుప్పుమంటున్నాయి. ఇప్పుడు ఈ వార్తలే నిజం అయితే ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ రైట్స్ ను కొనుక్కోవాలి అని ఇప్పటికే ‘ఆర్ ఆర్ ఆర్’ నిర్మాతతో రాయబారాలు మొదలుపెట్టిన మిగతా బయ్యర్లు కూడ దిల్ రాజ్ అల్లోచనలను అనుసరిస్తే ‘ఆర్ ఆర్ ఆర్’ మార్కెట్ కు పెను ప్రమాదం పొంచి ఉన్నది అంటూ ఊహాగానాలు హల్ చల్ చేస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: