టాలీవుడ్ లో జర్నీ, షాపింగ్ మాల్ మూవీస్ లో హీరోయిన్ గా నటించిన అంజలి అచ్చమైన తెలుగమ్మాయి.  ఆ తర్వాత వెంకటేష్, మహేష్ బాబు నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చట్టు మూవీలో అంజలి మంచి పేరు తెచ్చుకుంది.  తెలుగు, తమిళ, మళియాళ భాషల్లో నటిస్తుంది.  తెలుగమ్మాయ్ అంజలి గురించి ఈ మధ్య అనేక రూమర్లు వినిపించిన విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా కోలీవుడ్ హీరో జై‌తో కొన్నాళ్లుగా ప్రేమలో ఉందని, అయితే కొన్ని కారణాల వల్ల ఇద్దరూ విడిపోయారనే వార్తలు బాగా వినిపించాయి.  గత  కొంత కాలంగా తెలుగు లో ఈ అమ్మడికి పెద్దగా ఛాన్సులు రావడం లేదన్న విషయం తెలిసిందే.  

 

కాకపోతే తమిళ్ లో మాత్రం అంజలికి మంచి విజయాలు దక్కుతున్నాయి.  తాజాగా ఈ అమ్మడు ప్రస్తుతం ఐటమ్ సాంగ్స్ లో కూడా నటిస్తుంది.  ఈ నేపథ్యంలో అంజలి అప్పుడప్పుడు తెలుగు కనిపిస్తుంది.  ఆ మద్య గీతాంజలి లాంటి హర్రర్ మూవీలో నటించి మంచి పేరు తెచ్చుకుంది. తాజాగా అనుష్క నటించిన ‘నిశ్శబ్ధం’ మూవీ లో నటిస్తుంది.  త్వరలో ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ లవ్ ఫెయిల్యూర్ గురించి అంజలి వద్ద ప్రస్తావించగా సంచలన విషయాలు తెలిపింది. నాది లవ్‌ ఫెయిల్యూర్‌ కాదు. అసలు నేను ప్రేమలో లేను.

 

జై నాకు మంచి ఫ్రెండ్‌ మాత్రమే అంటుంది.  జర్నీలో వీద్దరూ కలిసి నటించిన విషయం తెలిసిందే. ప్రేమలో ఉన్నట్టు కానీ, పెళ్ళి చేసుకోవాలని అనుకున్నట్టు కానీ ఎక్కడా ఎవరితోనూ చెప్పలేదు. మా మధ్య ఏదో ఉందనీ, మేమిద్దరం పెళ్ళి చేసుకోబోతున్నామనీ, ఇప్పుడు విడిపోయామనీ ఇవన్నీ ఊహాగానాలే తప్ప వాస్తవాలు కావూ అంటుంది. వీటి గురించి నేను పెద్దగా ఆలోచించని అన్ని అన్నారు. ఎవరేమనుకున్నా మా మధ్య స్నేహం తప్ప మరొకటి లేదు. ఇంకా మీకు అనుమానాలు ఉంటే మీ ఇష్టం నేనేమీ చేయలేను.

మరింత సమాచారం తెలుసుకోండి: