పెళ్లి చూపులు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడు విజయ్ దేవరకొండ. ఇక ఆ తర్వాత సందీప్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన గీతా గోవిందం, టాక్సీవాలా సినిమాలతో విజయ్ క్రేజీ స్టార్ గా పేరు సంపాదించుకున్నాడు. అయితే విజయ్ ప్రస్తుతం పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఫైటర్ అనే సినిమా చూస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో విజయ్ హిందీ చిత్ర సీమకు పరిచయం కాబోతున్నాడు. ఈ ఫైటర్ కథ పాన్ ఇండియాకు అప్పీల్ అవుతుందని భావించిన బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్, పూరి, ఛార్మిలతో కలిసి ఈ చిత్ర నిర్మాణంలో పాలు పంచుకుంటున్నాడు. ఈ ఫైటర్‌ను తెలుగు, హిందీతో పాటు అన్ని సౌత్ ఇండియా భాషలలో ఒకేసారి తెరకెక్కించనున్నారు. ఈ నేపథ్యంలో ఫైటర్ సినిమా తరువాత విజయ్ దేవరకొండ ఏ దర్శకుడితో సినిమా చేయనున్నాడనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

 

 

అయితే విజయ్ దేవరకొండ ఇప్పటికే చాలా మంది యువ దర్శకుల కథలను విన్నాడట. వాటిలో కాస్త భిన్నంగా అనిపించిన కథకి ఆయన గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లు సమాచారం. 'బ్రోచేవారెవరురా' సినిమాతో హిట్ కొట్టిన డైరెక్టర్ వివేక్ ఆత్రేయ చెప్పిన కథ నచ్చడంతో విజయ్ ఓకే చెప్పాడట. అంతే కాదు ఈ సినిమాకు సంబందించి ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా స్టార్ట్ అయినట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ పాత్ర చాలా కొత్తగా ఉండబోతోందట. ఈ సినిమాకు సంబందించిన పూర్తి విషయాలు త్వరలో తెలియాల్సి ఉంది. కాగా ఇప్పటికే కరోనా కారణంగా ఫైటర్ సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఇక లాక్ డౌన్ పూర్తి కాగానే ఈ సినిమా తదుపరి షెడ్యూల్ షూటింగ్ మొదలవుతుంది. ఆ తర్వాత విజయ్ తన తదుపరి సినిమాను కూడా త్వరగానే ముగించాలనే ఆలోచనలో ఉన్నాడని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: